Hrithik Zomato Ad: హృతిక్ , కత్రినా యాడ్‌పై విమర్శలు.. రంగంలో దిగిన యాజమాన్యం.. ప్రతి కస్టమర్ హీరో అంటూ వివరణ..

Hrithik Zomato Ad: బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు జొమాటో యాప్ ప్రకటనలో నటించారు. అయితే ఈ యాడ్ పై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..

Hrithik Zomato Ad: హృతిక్ , కత్రినా యాడ్‌పై విమర్శలు.. రంగంలో దిగిన యాజమాన్యం.. ప్రతి కస్టమర్ హీరో అంటూ వివరణ..
Zomato Ad
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2021 | 7:29 PM

Hrithik Zomato Ad: బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ లు జొమాటో యాప్ ప్రకటనలో నటించారు. అయితే ఈ యాడ్ పై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. జొమాటో కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ యాడ్ పై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. దీంతో జొమాటో యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫుడ్ డెలివరీ యాప్ ప్రకటనలు ‘మంచి ఉద్దేశ్యంతో ఉంటాయి, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ .. వివరణ ఇచ్చింది.

జొమాటో సోమవారం తమ ట్విట్టర్‌లో వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ యాడ్స్‌లో త‌మ డెలివ‌రీ ఏజెంట్ల‌ను హీరోలుగా చూపించే ప్రయ‌త్నం సదరు సంస్థ. క‌త్రినా కైఫ్, హృతిక్ లాంటి స్టార్ల‌కు ఫుడ్ డెలివ‌రీ ఇచ్చిన త‌ర్వాత‌.. వాళ్లు సెల్ఫీల కోసం వెయిట్ చేయ‌మ‌ని లోనికి వెళ్లి వ‌చ్చే లోపు మ‌రో ఆర్డ‌ర్ రావ‌డంతో ఏజెంట్లు వెళ్లిపోతారు. త‌మ కంపెనీ, డెలివ‌రీ ఏజెంట్లు ఎంత నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తారో ఈ యాడ్స్ ద్వారా జొమాటో చెప్పాల‌నుకుంది. తమ డెలివరీ ఏజెంట్లకు హృతిక్ , కత్రినా కంటే వినియోదారులే హీరోలని ఈ ప్రకటన వెనుక ఉద్దేశం. వారు తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను హీరోలుగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. అయితే ఇదే విషయంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటుంది జొమాటో..

ఈ యాడ్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరు మీ డెలివ‌రీ ఏజెంట్ల‌తో ఈ స్థాయిలో పని చేయించుకుంటారా? ఇది శ్ర‌మ దోపిడీ.. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు పెద్ద మొత్తం ఇచ్చి యాడ్స్ చేయించుకునే బ‌దులు.. మీ డెలివ‌రీ ఏజెంట్ల‌కు కాస్త ఎక్కువ చెల్లించి వాళ్ల జీవితాల‌ను నిల‌బెట్టండి అంటూ రాకరకలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జొమాటో సంస్థ తమ యాడ్ పై వివరణ ఇస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

కత్రినా , హృతిక్ ఇద్దరూ అనేక వాణిజ్య ప్రకటనలను చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి బ్యాంగ్ బ్యాంగ్ , జిందగీ నా మిలేగి దోబారా వంటి సినిమాల్లో నటించారు. కత్రినా చివరిగా సల్మాన్ ఖాన్‌తో భరత్‌లో కనిపించింది. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. ఇక హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

Also Read: Andhra Pradesh: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ సరికొత్త రికార్డ్‌.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..