Priyanka Chopra: భయంతో కన్నీళ్ళు పెట్టుకున్న ప్రియాంక చోప్రా.. కారణం ఏంటో తెలుసా..?
గ్లోబల్ బ్యూటీ ప్రియక చోప్రా గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో.. కేవలం బాలీవుడ్ సినిమాతోనే కాకుండా హాలీవుడ్ సినిమాలతోనే ఫెమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియక చోప్రా గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో.. కేవలం బాలీవుడ్ సినిమాతోనే కాకుండా హాలీవుడ్ సినిమాలతోనూ ఫెమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన కన్నా దాదాపు 10ఏళ్ళు చిన్నవాడిని పెళ్ళాడి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు సినిమాలు,వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండే ప్రియాంక కరోనా కారణంగా దాదాపు ఒక ఏడాది పాటు ఇంటికే పరిమితం అయ్యింది. ఇన్నాళ్లు భర్తతో కలిసి ఇంట్లోనే ఉన్న ప్రియాంక ఎట్టకేలకు ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జర్మనీలో జరిగిందంట. ఆ సమయంలో భయం తో కనీరు పెట్టుకుందంట ఈ ముద్దుగుమ్మ. ఈ విషయాన్నీ ప్రియాంక స్వయంగా తెలిపింది. ప్రియాంకకు అసలు ఎందుకంత భయం వేసింది.? కనీరు పెట్టుకునేంత గా ఏం జరిగింది అంటే.. దాదాపు ఏడాది పాటు సినిమాలు లేక ఇంట్లోనే కుటుంబసభ్యులతో చాలా సేఫ్‌గా ఉన్నాను. ఇంట్లో వారితో ఉన్నన్ని రోజులు చాలా సేఫ్‌గా హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఈ పాండమిక్ సమయంలో మళ్లీ షూటింగ్ అంటే ఒక్క సారిగా భయం వేసింది. అయినా తప్పదు దాంతో షూటింగ్ కోసం జర్మనీ వెళ్ళాను . అప్పుడు చాలా టెన్షన్ అనిపించింది.
అప్పటివరకు ఎలాంటి భయం లేకుండా ఉన్న కానీ జర్మనీకి వెళ్లేందుకు విమానం ఎక్కగానే భయంతో కన్నీరు వచ్చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న భయంతో కన్నీరు పెట్టుకున్నా అని ప్రియాంక స్వయంగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరపడంతో మెల్లగా భయం పోయిందని, ఆ తర్వాత అంతా సాఫీగా సాగిందని తెలిపింది ప్రియాంక చోప్రా.. ఇక ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :
భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..