Tollywood drug case: అప్రూవర్‌గా మారిన కెల్విన్.. టాలీవుడ్‌లో ప్రకంపనలు.. వారి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్!
డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేసులో లింక్ ఉన్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది.ఇక ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే..
డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేసులో లింక్ ఉన్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది.ఇక ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే.. సినీ తారల బ్యాంక్ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చెయ్యడం. అవును.. డ్రగ్స్, మనీల్యాండరింగ్, హవాలాతో లింకై ఉందని ఈడీ నమ్ముతున్న సినీ తారల అకౌంట్స్‌ను నిలిపివేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకి మూలం కెల్విన్ అనే వ్యక్తి. జరిగిన దానికి.. జరుగుతున్నదానికి.. జరగబోయేదానికీ అన్నింటికీ కారణం అతనే. తాజాగా, కెల్విన్ అప్రూవర్‌గా మారడంతోనే డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌లో కొందరి ప్రముఖుల కూసాలు కదిలే పరిస్థితి వచ్చింది. ఈ కేసు ఇప్పటిది కాదు. గతేడాది నమోదైన కేసు. డ్రగ్స్ కేసు రిజిస్ట్రర్ అయినప్పుడు ఎక్సైజ్ శాఖ విచారిస్తే ఏమాత్రం నోరు తెరవని కెల్విన్.. ఈడీ వచ్చాక మాత్రం గుట్టు విప్పక తప్పలేదు. ఇప్పటికే ఈడీ ముందు 12సార్లు విచారణకు హాజరయ్యాడు కెల్విన్. అతని దగ్గర స్టేట్‌మెంట్ తీసుకున్నాకే సినీతారలకు నోటీసులు ఇచ్చింది ఈడీ.
కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను ఆసాంతం పరిశీలించి, పరీక్షించి.. ఏదో మతలబు ఉందని డిసైడ్ అయ్యాక అతని అకౌంట్‌ను ఫ్రీజ్ చేసింది ఈడీ. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతం ఒక్కొక్కరినీ ఈడీ గదికి లాగుతున్న అధికారుల నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుసా… గుట్టు వీడిన ఒక్కో సినీ తార బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేసుకుంటూ పోవడం. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను గంటల తరబడి విచారించారు. గతేడాది ఎక్సైజ్ అధికారుల మాదిరి సాగడం లేదు.. ఇంట్రాగేషన్. సమ్‌థింగ్ సీరియస్ అన్నట్లే ఉంది మేటర్. మరి మున్ముందు ఈ కేసులో ఎన్ని సంచలన ట్విస్టులు చోటుచేసకుంటాయో, వేచి చూడాలి.
విచారణ తేదీలు, హాజరవ్వాల్సిన ప్రముఖులు: Aug 31: పూరీ జగన్నాథ్ (ఇప్పటికే విచారణ పూర్తయ్యింది) Sept 2 : చార్మీ కౌర్ Sept 6 : రకుల్ ప్రీత్ సింగ్ Sept 8 : రానా దగ్గుబాటి Sept 9 : రవితేజతోపాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ Sept 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ Sept 15: ముమైత్ ఖాన్ Sept 17: తనీష్ Sept 20: నందు Sept 22: తరుణ్
Also Read: భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..