Paid Post New Rules: ఇన్‌స్టా పోస్టులతో కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు.. భారత్ నుంచి టాప్ ప్లేస్‌లో కోహ్లీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్
Influencer Market: ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీలకు ఏఎస్‌సీఐ నూతన రూల్స్ కాస్త ఇబ్బందిగానే తయారయ్యాయి. ప్రకటనలతో తప్పుదారి పట్టిస్తే మాత్రం రూ. 50 లక్షల జరిమానా..
Influencer Market: వార్తాపత్రికలు, టీవీలు, హోర్డింగ్‌లలో ప్రముఖుల ప్రకటనలు చూసిన వెంటనే, వారు కొంత డబ్బు తీసుకొని ప్రకటనలు చేస్తున్నారని మనకు తెలుస్తుంది. కానీ. సోషల్ మీడియాలో మాత్రం అలా తెలియదు. సెలబ్రిటీలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ.. ప్రతి పోస్ట్ నుంచి చాలా సంపాదిస్తుంటారు. అయితే అవి పెయిడ్ కంటెంట్ అని మాత్రం చెప్పడానికి సంకోచిస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఏఎస్‌సీఐ (ASCI) మార్గదర్శకాలను అనుసరించి, చాలా మంది ప్రముఖులు తమ పోస్ట్‌లపై ‘పెయిడ్ ప్రమోషన్’ లేదా ‘ప్రకటన’ అంటూ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.
జూన్ 14, 2021 నుంచి అమల్లోకి వచ్చే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) మార్గదర్శకాల ప్రకారం, డబ్బు లేదా ఏదైనా ఇతర లావాదేవీల పరంగా జరిగే ప్రమోషనల్ పోస్ట్‌లకు కచ్చితంగా పెయిడ్ ప్రమోషన్ లేదా ప్రకటన అంటూ ట్యాగ్‌ను ఉంచాలని పేర్కొంది.
సంపాదనలో విరాట్ అగ్రస్థానం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 30 గ్లోబల్ సెలబ్రిటీల జాబితాను హాప్పర్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే 19 వ స్థానంలో నిలిచాడు. అతని ప్రతి పోస్ట్ దాదాపు రూ. 5కోట్లు సంపాదిస్తున్నాడు. అదే సమయంలో, ప్రియాంక చోప్రా ఈ జాబితాలో 27 వ స్థానంలో ఉంది. ఆమె ప్రతి పోస్ట్ నుంచి రూ. 3 కోట్లు సంపాదిస్తుంది.
డిజిటల్ మార్కెటింగ్ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారా సెలబ్రిటీలు చాలా సంపాదిస్తున్నారు. వీరు షేర్ చేసే ప్రతి పోస్ట్‌లో ఎంతో కొంత డబ్బుతో ముడిపడి ఉంటుంది. అయితే వీటికి రేట్ కార్డ్ అంటూ ఏమీలేదు. చాలా సందర్భాలలో ఫుల్ ప్రమోషన్ ప్యాకేజీ అందిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ ప్యాకేజీలో వారు సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టాలో స్పష్టంగా చెప్తారంట.
చిక్కుల్లో కోహ్లీ.. ఆచితూచి అడుగులేస్తున్న హృతిక్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని ఆమోదిస్తూ పోస్ట్ చేశారు. కానీ, దానికి పెయిడ్ పోస్ట్ అనే ట్యాగ్ లేదు. దీంతో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయ్యాడు. దీంతో ఏఎస్‌సీఐ నోటీసు పంపింది. ఆ తర్వాత విరాట్ పోస్ట్‌ను ఎడిట్ చేసి ‘పెయిడ్ పోస్ట్’ అనే ట్యాగ్‌ను పెట్టాడు.
దీని తరువాత, పెద్ద సెలబ్రిటీలందరూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పెయిడ్ పోస్ట్‌లు పెట్టేందుకు కొంతమంది నిరాకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, ఫాలోవర్స్ తక్కువగా ఉన్నవారు ఇలాంటి నియమాన్ని ఉల్లంఘిస్తే ఎవరూ గుర్తించరు. కానీ, విరాట్ లాంటి పెద్ద సెలబ్రిటీలు మాత్రం ఇట్టే చిక్కుకునే అవకాశం ఉంది. మరోవైపు, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పటికే పెయిడ్ ప్రమోషనల్ పోస్ట్‌లను ట్యాగ్ చేస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తూ దూసుకపోతున్నాడు. ఏఎస్‌సీఐ ఒక ఫ్రెంచ్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌తో ట్రాకింగ్ చేస్తోంది. దీంతో చాలా పోస్టులు నిఘా పర్యవేక్షణలో ఉంటున్నాయి. ఇలాంటి వాటిపై సాధారణ ప్రజలు కూడా ఏఎస్‌సీఐ ఫిర్యాదు చేయవచ్చు.
ఇది ప్రారంభం మాత్రమే.. భారతదేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుతం మొత్తం డిజిటల్ మార్కెటింగ్‌లో 10% వాటాను కలిగి ఉంది. లాక్‌డౌన్‌లో ఇది చాలా వేగంగా పెరిగింది. దీని స్థాయి ఏటా రూ. 1000 కోట్ల వరకు పెరిగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్‌లో 70% వాటాను కలిగి ఉంది.
తప్పుదారి పట్టిస్తే రూ. 50 లక్షల జరిమానా.. రేడిఫ్యూజన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ చీఫ్ మెంటార్ డాక్టర్ సందీప్ గోయల్ మాట్లాడుతూ ఏఎస్‌సీఐ అనేది ఓ సంస్థ. దీనికి మార్గదర్శకాలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండవు. కానీ, వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, తప్పుదారి పట్టించే ప్రకటనగా కేసు రుజువైతే, మొదటి సందర్భంలో రూ. 10 లక్షల వరకు జరిమానా, పదేపదే ఉల్లంఘించినందుకు రూ .50 లక్షల వరకు జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంది.
మరింత పారదర్శకంగా సోషల్ మీడియా ప్రమోషన్.. ప్రేక్షకులు ఏ రకమైన కంటెంట్‌ను కోరుకుంటున్నారో తెలుసుకోవాలని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ వావో డిజిటల్ CEO నేహా పూరి తెలిపారు. దీంతో ఇకనుంచి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మరింత పారదర్శకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే 15 నుంచి 20 శాతం మంది మాత్రమే ఇలాంటి మార్గదర్శకాలను పాటిస్తున్నారని ఆమె తెలిపింది.
ప్రపంచకప్ అందించాడు.. ఆ వెంటనే నిషేధాన్ని ఎదుర్కున్నాడు.. మరో దేశానికి ఆడనున్నాడు.. అతడెవరంటే!