ప్రపంచకప్ అందించాడు.. ఆ వెంటనే నిషేధాన్ని ఎదుర్కున్నాడు.. మరో దేశానికి ఆడనున్నాడు.. అతడెవరంటే!

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది క్రికెటర్లు తహతహలాడుతుంటారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తారు...

ప్రపంచకప్ అందించాడు.. ఆ వెంటనే నిషేధాన్ని ఎదుర్కున్నాడు.. మరో దేశానికి ఆడనున్నాడు.. అతడెవరంటే!
Plunkett
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 01, 2021 | 1:38 PM

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది క్రికెటర్లు తహతహలాడుతుంటారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తారు. జాతీయ జట్టు పిలుపు కోసం ఎదురు చూస్తారు. కానీ చాలామందికి నిరాశే మిగులుతుంది. అత్యుత్తమ ప్రదర్శనలు ఎన్ని చేసినా కూడా అప్పుడప్పుడూ లక్ కలిసి రావాలి. ఇక తాజాగా తమ దేశ జాతీయ జట్టులో చోటు దక్కని ఆటగాళ్లు.. ఇప్పుడు అమెరికా వైపు అడుగులు వేస్తున్నారు.

అండర్ -19 వరల్డ్‌కప్‌కు భారతదేశానికి నాయకత్వం వహించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కూడా వారిలో ఒకరు. ఇప్పుడు మరొక ప్రపంచ ఛాంపియన్ ఆటగాడి కూడా ఈ జాబితాలోకి చేరాడు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ ప్లంకెట్. లియామ్ ప్లంకెట్ ఈ ఏడాది చివరిలో ఇంగ్లాండ్ క్రికెట్‌ని విడిచిపెట్టి అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అతడే ధృవీకరించాడు.

2019లో వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జాతీయ జట్టులో లియామ్ ప్లంకట్ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్ గెలవడం ఇదే మొదటిసారి. అప్పుడు ప్లంకెట్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ప్లంకట్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇదే అతడి చివరి వన్డే మ్యాచ్. ఇంగ్లాండ్ తరపున ప్లంకట్ 89 వన్డేలు, 13 టెస్టులు, 22టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 135 వికెట్లు, టెస్టుల్లో 41 వికెట్లు, టీ20 ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లో ప్లంకట్.. సర్రే కౌంటీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

“గత మూడు సంవత్సరాలుగా సర్రేలో నాకు లభించిన మద్దతు మరువలేనిది. నా కెరీర్ అంతటా మద్దతిస్తూ వచ్చిన అభిమానులకు, కోచ్‌లకు, సహచర ఆటగాళ్ళకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇంగ్లాండ్‌ జట్టుతో నా కెరీర్‌ను పూర్తిగా ఆస్వాదించాను. నేను నా జీవితంలో మరో అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నా. మేజర్ లీగ్ క్రికెట్‌తో జత కలవడం సంతోషాన్ని ఇస్తోంది.” అని ప్లంకట్ అన్నాడు.

ఇవి చదవండి:

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!