- Telugu News Photo Gallery Cricket photos IND vs ENG: england playing 11 for 4th test anderson out and mark wood entry in oval match
IND vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్‌తో తలపడే జోరూట్ సేన ఇదే.. భారీ మార్పులతో ఓవల్ బరిలోకి!
IND vs ENG: లీడ్స్ విజయంతో ఫాంలోకి వచ్చిన ఇంగ్లండ్ టీం భారీ మార్పులతో ఓవల్ టెస్టులో బరిలోకి దిగనుంది.
Updated on: Sep 01, 2021 | 5:10 PM

లీడ్స్ టెస్ట్‌లో టీమిండియాపై విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. రేపటి నుంచి మరో ఆసక్తికరపోరుకు సిద్ధమైంది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ టీం.. పేలవ బ్యాటింగ్‌తో ఘోర పరాజయం మూటగట్టుకున్న కోహ్లీసేన ఓవల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

నాలుగో టెస్ట్‌లో ఇరు జట్లు సైతం హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ మార్పులకు ప్లాన్ చేసింది. ఇప్పటికే వికెట్ కీపర్ జోస్ బట్లర్.. తన రెండో సంతానం కోసం పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. జోస్ బట్లర్ గైర్హాజరీతో జానీ బెయిర్ స్టో కీపర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక బట్లర్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు.

స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, యువ పేసర్ ఓలీ రాబిన్సన్‌లలో ఒకరు నాలుగో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ ప్లేయర్ల రొటేషన్ పాలసీలో భాగంగా ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతివ్వనున్నారు. అండర్సన్ స్థానంలో క్రిస్ వోక్స్ ఓవల్ టెస్టులో ఆడనున్నట్లు తెలుస్తోంది. సకీబ్ మహమూద్ ప్లేస్‌లో మార్క్ వుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

జోస్ బట్లర్ తప్పుకోవడంతో ఇంగ్లండ్ మరో ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. బిల్లింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్/ఓలీ పోప్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్,ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్.





























