Andhra Pradesh: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ సరికొత్త రికార్డ్‌.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Andhra Pradesh-Covid Vaccine: కరోనా వైరస్ రోజుకో రకంగా మారుతూ వేగంగా విజృంభిస్తుంది. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు రానున్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలోని..

Andhra Pradesh: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ సరికొత్త రికార్డ్‌.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Covid Vaccine
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2021 | 7:11 PM

Andhra Pradesh-Covid Vaccine: కరోనా వైరస్ రోజుకో రకంగా మారుతూ వేగంగా విజృంభిస్తుంది. త్వరలో థర్డ్ వేవ్ ముప్పు రానున్నదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి.  వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో మరో రికార్డ్ ను సృష్టించింది. రాష్ట్రంలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో సరికొత్త మైలురాయికి చేరుకుంది.

రాష్ట్రంలో మొతం జనాభా ఆరు కోట్లు కాగా సగం మందికి వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కరోనా నివారణ కోసం ఎనిమిది నెలల క్రితం చేపట్టింది. అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో సగంమంది జనాభాకు టీకాలు వేసింది.  అయితే ఇంత శరవేగంగా టీకాలు వేయడానికి కారణం.. ఏపీలోని వాలంటీర్ల వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ అని అంటున్నారు. వీరి సాయంతో శరవేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తుంది.

దేశంలోని ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ లో ఎపినే టాప్ గా నిలిచింది. ఈరోజు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు  వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు ఈరోజు ఇచ్చిన టీకాలతో రాష్ట్రంలో మూడు కోట్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 3,03,01,620 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వారి సంఖ్య- 2,18,10,441…. రెండు డోసులు వేసుకున్న వారు…84,91,179 . వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2500 కేంద్రాల్లో  స్పెషల్ డ్రైవ్ ను అధికారులు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ కోసం ప్రతి ఒక్కరికి నిర్ణీత సమయాన్ని కేటాయించారు.

Also Read:

కరోనా నిబంధనలతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న కొన్ని దేశాలు.. బెస్ట్ ఛాయిస్‌గా ఈ ఐదు దేశాలు..

మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగితే కష్టాలపాలవుతారు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!