Go Maha Padayatra: వారిది మహా సంకల్పం.. గోమాత రక్షణ కోసం దీక్ష.. అలిపిరికి చేరిన మహాపాదయాత్ర..

వాళ్లది మహా సంకల్పం. గోవును కభేళాలకు తరలించకుండా జాతీయ ప్రాణిగా గుర్తించాలన్నది లక్ష్యం. గోమాత విశిష్టత, ప్రాధాన్యత సమస్త మానవాళికి తెలియజేయాలని చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగానే లక్షలాది అడుగులు వేస్తూ...

Go Maha Padayatra: వారిది మహా సంకల్పం.. గోమాత రక్షణ కోసం దీక్ష.. అలిపిరికి చేరిన మహాపాదయాత్ర..
Alipiri Padayatra
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 31, 2021 | 9:48 PM

వాళ్లది మహా సంకల్పం. గోవును కభేళాలకు తరలించకుండా జాతీయ ప్రాణిగా గుర్తించాలన్నది లక్ష్యం. గోమాత విశిష్టత, ప్రాధాన్యత సమస్త మానవాళికి తెలియజేయాలని చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగానే లక్షలాది అడుగులు వేస్తూ…వందల మైళ్ల వరకు సాగింది వారి ప్రయాణం. గోవధని అరికట్టడం…గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలన్న మంచి సంకల్పంతో హైదరాబాద్‌లో మొదలుపెట్టిన పాదయాత్ర…అలిపిరికి చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ గురుస్వామి నేతృత్వంలో కొందరు భక్తులు గోవింద మాల ధరించి మహాపాదయాత్ర చేపట్టారు. సుమారు 18రోజుల పాటు 565 కిలోమీటర్లు కాలినడక తిరుపతికి చేరుకున్నారు. గోమాత ప్రాధాన్యత, గోవు విశిష్టత అందరికి తెలియజేసేందుకు ఈ మహాకార్యాన్ని చేపట్టినట్లుగా స్వాములు తెలిపారు.

ఈ నెల 15న హైదరాబాద్ నుంచి మొదలైన పాదయాత్ర నిన్న అలిపిరి శ్రీవారి చెంతకు చేరింది. సత్సంకల్పంతో చేస్తున్న పాదయాత్రకు ప్రతి చోట ఘన స్వాగతం లభించింది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో పాటు హిందు సంఘాలు, మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

అలిపిరికి చేరుకున్న పాదయాత్ర కు TTD పాలక మండలి మాజీ సభ్యులు శివ కుమార్ స్వాగతం పలికారు. శ్రీవారి ఆకలి తీర్చిన ఆవు అనేక కష్టాలను ఎదుర్కొంటోందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్.

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గతంలో TTD పాలక మండలిని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు. అది సాధించే వరకు కృషి చేస్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..