AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shershaah: మరో ఘనత సాధించిన ‘షేర్షా’.. ప్రైమ్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డ్..

Shershaah: కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా షేర్షా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. అప్పటి నుంచి

Shershaah: మరో ఘనత సాధించిన 'షేర్షా'..  ప్రైమ్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా రికార్డ్..
Shershaah
uppula Raju
|

Updated on: Aug 31, 2021 | 4:33 PM

Share

Shershaah: కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా షేర్షా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా విజయవంతంగా దూసుకెళుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ చిత్రంగా నిలిచింది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు సంపాదించింది. ప్రేక్షకుల భారీ ఆదరణతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

ఈ సందర్భంగా నిర్మాత కరణ్‌ జోహార్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన సినిమాగా ‘షేర్షా’ నిలవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఇండియాలో 4,100 పట్టణాలలో ప్రసారం చేశారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది IMDB లోనూ 8.9 రేటింగ్‌తో ప్రజాదరణ పొందింది’ అన్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాకు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు.

శివ పండిట్, రాజ్ అర్జున్, ప్రణయ్ పచౌరి, హిమాన్షు అశోక్ మల్హోత్రా, నికితిన్ ధీర్, అనిల్ కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరే భారతీయ చలనచిత్రాన్ని ఇంతగా చూడలేదు. 8.9 యూజర్ రేటింగ్‌తో 88,000 పైగా IMDb యూజర్లు ఓటు వేశారు. షేర్‌షా అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ మూవీగా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇప్పటికీ ప్రైమ్ లో టాప్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో రిప్రైజల్, మూడో ప్లేస్ లో హోమ్, నాలువ స్థానంలో ద రిథమ్ సెక్షన్, ఐదో ప్లేస్ లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాలున్నాయి.

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

Tollywood Drugs Case: పూరీని విచారిస్తున్న ఈడీ అధికారులు.. డబ్బుల బదిలీపై ఆరా..

Post Corona Symptoms: కరోనా వదిలిపెట్టినా.. సంవత్సరం వరకూ వదలని ఆ లక్షణాలు.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..