Tollywood Drugs Case: పూరీని విచారిస్తున్న ఈడీ అధికారులు.. డబ్బుల బదిలీపై ఆరా..

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సినీ

Tollywood Drugs Case: పూరీని విచారిస్తున్న ఈడీ అధికారులు.. డబ్బుల బదిలీపై ఆరా..
Puri Jagannadh
Follow us
uppula Raju

|

Updated on: Aug 31, 2021 | 4:08 PM

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని విచారిస్తున్నారు. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇచ్చారు. పూరి అకౌంట్ల నుంచి బదిలీ ఆయన డబ్బుల పై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. విదేశీయులకు చేసిన చెల్లింపులు, విదేశాలకు బదిలీ అయిన డబ్బులపై ప్రశ్నల వర్షం కురిపిస్తు్నారు. అయితే బదిలీ అయిన డబ్బులను షూటింగ్‌లు, సినిమాకి సంబంధించిన డబ్బులుగా పూరి చెబుతున్నారు. 2017 కు ముందు నాలుగు సంవత్సరాలకు సంబంధించి అకౌంట్ల లావాదేవీల పరిశీలన జరుగుతుంది. డ్రగ్ కొనుగోలు తేదీలు, డబ్బులు బదిలీ అయిన తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి పూరి జగన్నాధ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పూరి జగన్నాధ్‌తో పాటు ఆయన కుమారుడు ఆకాష్, సీఏ(చార్టెడ్ అకౌంటెట్) ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాల కింద ఇప్పటికే సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటిసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనుంది.

విదేశాలకు పెద్దఎత్తున నిధులను మళ్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు సిట్ అండ్ ఈడీ దర్యాప్తులో తేలింది. మరి, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తే, దానికి డబ్బులు కట్టిందెవరు? ఎవరి ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయి? ఈ కోణంలోనే ఈడీ ఇంటరాగేషన్ సాగుతోంది. ఈ రోజు డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ను విచారించనున్న ఈడీ.. సెప్టెంబర్ 2న ఛార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, అదే రోజున రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్-క్లబ్ జీఎం…. 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు… చివరిగా సెప్టెంబర్ 22న తరుణ్ ఈడీ ముందుకు రానున్నారు.

Post Corona Symptoms: కరోనా వదిలిపెట్టినా.. సంవత్సరం వరకూ వదలని ఆ లక్షణాలు.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

Megastar Chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు.. మరణించిన అభిమాని కూతురిని పదేళ్లుగా చదవిస్తున్న చిరంజీవి..

AP Weather Alert: ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు..! ఆ 3 జిల్లాలకు హెచ్చరికలు..