Paagal Movie: ఓటీటీలోకి విశ్వక్ సేన్ సినిమా.. అమెజాన్‌లో పాగల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే…
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. నివేదా పేతురాజ్ జంటగా నటించిన లెటేస్ట్ చిత్రం పాగల్. ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా..
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. నివేదా పేతురాజ్ జంటగా నటించిన లెటేస్ట్ చిత్రం పాగల్. ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల ఆగస్ట్ 14న ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ పాగల్ చిత్రాన్ని కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాకు రధాన్ సంగీతం అందించగా.. ఇందులో విశ్వక్ తల్లి ప్రేమ లాంటి ప్రేమ అందించే అమ్మాయి కోసం తపన పడే యువకుడి పాత్రలో నటించాడు. తాజాగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడు… డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉన్నప్పుడే ఓ సినిమా సూపర్ హిట్ అయినట్లుగా భావిస్తాను అని అన్నారు. అంతేకాకుండా.. పాగల్ సినిమాకు వసూల్లు బాగా వచ్చాయని.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉందన్నారు.
కరోనా సమయంలోనూ ప్రేక్షకులు సినిమా చూడ్డానికి వచ్చారని.. తమ మూవీకి కలెక్షన్ ఎక్కువగానే వచ్చినట్లుగా నిర్మాత తెలిపారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ఆశించిన స్థాయిలో థియేటర్స్‌కు రావడం లేదు. థర్డ్ వేవ్ వస్తుందని వినిపిస్తున్న వార్తలు కూడా ఓ కారణం కావొచ్చు. మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చినప్పుడే పెద్ద స్థాయి కలెక్షన్స్ చూడొచ్చు అంటూ చెప్పుకోచ్చారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ పాగల్ మూవీ ట్రైలర్ విడుదల చేసింది.
ట్రైలర్..
Also Read: Karthika Deepam: రేపు కార్తీక్‌కు నాకు పెళ్లి రెచ్చిపోతున్న మోనిత.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!
Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. నెట్టింట్లో సంబరాలు జరుపుకుంటున్న పూజా హెగ్డే..