Aha September Movies: సరికొత్త కంటెంట్‌తో రాబోతున్న ఆహా.. సెప్టెంబర్‌లో సందడి చేసే సినిమాలు ఇవే..
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే టాల్క్ షోస్‌తో ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించడంలో ముందుంటుంది ఆహా.
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే టాల్క్ షోస్‌తో ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించడంలో ముందుంటుంది ఆహా. ప్రతి వారం వారం సరికొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. అటు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా..ఇతర భాష చిత్రాలను సైతం డబ్ చేసి తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే వెబ్ సిరీస్‌లతోపాటు.. కామెడీ ఓరియెంటెండ్ చిత్రాలను అందిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ.. మిగతా ఓటీటీ సంస్థలకు పోటీనిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందించిన ఆహా.. ఇప్పుడు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సెప్టెంబర్‌లో ఆహాలో అలరించబోయే సినిమాలు ఇవే. అవెంటో తెలుసుకుందామా.
ఏక్ మినీ కథ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుటున్న సంతోష్ శోభన్, టినా శిల్పరాజ్ జంటగా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులను అందించనుంది. ఈ సిరీస్ ఆహా వేదికగా సెప్టెంబర్ 10, 2021న విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు జాన్తన్ ఎడ్‌వర్డ్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌ను ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విష్ణు ప్రియ, సాయి శ్వేత, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్, జాన్సీ లక్ష్మీ, వెంటక్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అలాగే మంచు లక్ష్మీ హోస్ట్‌గా ఆహా భోజనంబు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సెలబ్రెటీలు వారికి నచ్చిన ఆహారాన్ని రెడీ చేయడంతోపాటు.. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంటారు. ఇందులో ఇప్పటికే విశ్వక్ సేన్, రకుల్ వంటి తారలు పాల్గోని సండి చేశారు. అయితే సెప్టెంబర్ 3న ఈ షో 7వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.
విజయ్ సేతుపతి, గాయత్రి మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం పురియత పుథిర్. రొమాంటిక్ థ్రిలర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రానుంది. ఈ సినిమాను పిజ్జా 2 పేరుతో ఆహాలో సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ కానుంది.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న గణేశుడి లీలల పై మంచు లక్మీ హోస్ట్‌గా టాల్క్ షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నవదీప్ ముఖ్య అతిథిగా పాల్గోనబోతున్నారు.
యంగ్ హీరో సుశాంత్ అక్కినేని హీరోగా ఇటీవల నటించి సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఇందులో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 17న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళం సూపర్ హిట్ మూవీ వరనే అవశ్యముంద్ సినిమా ఇప్పడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దుల్కర్ సల్మాన్ నిర్మించి నటించిన ఈ సినిమా దర్శకుడు అనూప్ సత్యన్ తెరకెక్కించారు. ఇందులో శోభన, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించారు ఈ మూవీ సెప్టెంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: Jr.NTR: ఎన్టీఆర్ క్రికెట్ అందుకే చూడడంట.. ఆసక్తికర విషయాలను చెప్పిన యంగ్ టైగర్..