AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Shukla: ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ సిద్ధార్ద్ శుక్లా కన్నుమూత.. షాక్‌లో ఫ్యాన్స్..

Sidharth Shukla Death: హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారు. బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్‌గా సిద్ధార్థ్ శుక్లా గెలిచిన...

Sidharth Shukla: 'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్ సిద్ధార్ద్ శుక్లా కన్నుమూత.. షాక్‌లో ఫ్యాన్స్..
Siddharth Shukla
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 04, 2021 | 8:31 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్ద్ శుక్లా కన్నుమూశాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా నిలిచిన అతడు.. గుండెపోటుతో ముంబైలో తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రిందట సిద్ధార్థ్ తన ప్రియురాలు షెహనాజ్ గిల్‌తో కలిసి బిగ్ బాస్ ఓటీటీకి గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా అతడి మరణవార్తను విని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు సిద్ధార్థ్ శుక్లా. కాగా, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో అటు నార్త్.. ఇటు సౌత్‌ ప్రేక్షకులకు కూడా సిద్ధార్థ్ శుక్లా మరింత చేరువయ్యాడు.

1980వ సంవత్సరం డిసెంబర్ 12న జన్మించిన సిద్ధార్థ్ శుక్లా రచనా సంసద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ‘బాలికా వధు'(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు), ‘దిల్ సే దిల్ తక్’ వంటి డైలీ సీరియల్స్‌తో ఫేమస్ అయిన సిద్దార్థ్.. ‘జలక్ దిక్లాజా 6’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి’ ‘బిగ్ బాస్ 13’ వంటి రియాలిటీ షోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ 13 షో ద్వారానే సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ దగ్గరయ్యారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్దార్థ్ శుక్లా ఆకస్మిక మరణం ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తోంది. సిద్దార్థ్ ఇక లేడనే వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, సిద్ధార్థ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Follow Us
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు అలర్ట్.. జూలై 6 నుంచి 19వరకు స్కూళ్లకు వరుస సెలవులు
విద్యార్ధులకు అలర్ట్.. జూలై 6 నుంచి 19వరకు స్కూళ్లకు వరుస సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి