Jr.NTR: జక్కన్న నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 02, 2021 | 12:22 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మబవీ షూటింగ్ పూర్తైంది. అలాగే ఇటు బుల్లితెరపై

Jr.NTR: జక్కన్న నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..
Ntr

Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. అలాగే ఇటు బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరులు అనే రియాల్టీ షోకు హోస్ట్‏గా వ్యవహిరిస్తున్నారు. ఇటీవలే ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‏తో ముచ్చటిస్తూ.. తన వ్యక్తిగత విషయాలను చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్. ఇటీవల తనకు క్రికెట్ చూడాలన్న ఆసక్తి ఎందుకు పోయిందో.. అందుకు గల కారణం తన తండ్రి హరికృష్ణ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు ఎన్టీఱర్. ఇక తాజాగా తనను చూసి రాజమౌళి అసహ్యించుకున్నారంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు తారక్.

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ తనకు ఉన్న బట్టతల కారణంగా ఆత్మన్యూనత భావానికి గురయ్యేవాడినని.. తనను చూసి అందరూ నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్ల ఎక్కువగా బాధపడేవాడినని తెలిపాడు. దీంతో తారక్ స్పందిస్తూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. మొదట్లో చాలా లావుగా ఉండేవాడిని. కానీ ఏ రోజు లావుగా ఉన్నానని నాకు అనిపించలేదు. ఒకరోజు మా జక్కన్న నన్ను చూసి అసహ్యంగా ఉన్నావు అన్నారు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. మన చుట్టూ ఉన్న స్నేహితులే మనల్ని మార్గనిర్దేశం చేస్తారు. అలాంటివాళ్లే మన నిజమైన స్నేహితులు. ఆ రోజు నుంచి నేను జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. మీది జుట్టు ప్రాబ్లమ్.. నాది కొవ్వు ప్రాబ్లమ్.. అంతే తేడా అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

అలాగే నటనలో రాణించాలంటే.. ముఖ్యంగా ఉండాల్సింది నిజాయితీ అని. మనకు అన్ని తెలుసు అనుకుంటాం. కానీ ఏదీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనకు తెలియనివి జరుగుతుంటాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనకు అన్ని తెలుసని ధైర్యంగా ఉంటాం. మన కోరిక వైపు చాలా బలంగా ప్రయాణించాలి. అప్పుడే మన కల నెరవేరుతుంది. మీ కళ కూడా తప్పకుండా నెరువేరుతుంది అని తెలిపారు.

Also Read: Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..

Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu