Karthika Deepam: రేపు కార్తీక్‌కు నాకు పెళ్లి రెచ్చిపోతున్న మోనిత.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!

ఒక్కోసారి జీవితం ఎటునుంచి ఎటు మారుతుందో చెప్పడం చాలా కష్టం. మంచికి చెడుకూ మధ్య ఉండే సన్నని తేడాను గుర్తించకపోతే వచ్చే అనర్ధాలు పూలపాన్పు లాంటి జీవితాన్ని ముళ్లబాటలో పడేస్తాయి.

Karthika Deepam: రేపు కార్తీక్‌కు నాకు పెళ్లి రెచ్చిపోతున్న మోనిత.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!
Karthika Deepam Episode 1133
Follow us
KVD Varma

|

Updated on: Sep 01, 2021 | 8:01 AM

Karthika Deepam: ఒక్కోసారి జీవితం ఎటునుంచి ఎటు మారుతుందో చెప్పడం చాలా కష్టం. మంచికి చెడుకూ మధ్య ఉండే సన్నని తేడాను గుర్తించకపోతే వచ్చే అనర్ధాలు పూలపాన్పు లాంటి జీవితాన్ని ముళ్లబాటలో పడేస్తాయి. ఈ విషయాన్ని చక్కని కథనంతో కళ్ళకు కటినట్టు చూపిస్తోంది కార్తీకదీపం సీరియల్. తెలుగు టీవీ సీరియళ్ళ చరిత్రలో రికార్డులను తిరగరాసిన కుటుంబ కథా ధారావాహిక కార్తీకదీపం. ఆప్యాయతలు.. అనుబంధాలు.. ప్రేమ.. పెళ్లి.. చదువు.. సంస్కారం ఇలా ప్రతి అంశాన్ని సీరియల్ లోని పాత్రల ద్వారా చూపిస్తూ ఇంటిల్లిపాదినీ అలరిస్తోంది కార్తీకదీపం. ఈరోజు కార్తీకదీపం 1133వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది తెలుసుకుందాం.

మోనిత తన పంతం నెగ్గించుకోవడం కోసం తీవ్రమైన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. కార్తీక్ ను లాకప్ పాలు చేసిన మోనిత అతనికి కడుపునొప్పి వచ్చే మందును టీలో కలిపి ఇచ్చి ఆసుపత్రి పాలు చేసింది. ఆసుపత్రికి డాక్టర్ వేషంలో వచ్చిన మోనిత కార్తీక్ ను కట్టేసి ఉంచి మోనిత మాట్లాడటం మొదలు పెట్టింది. తనలోని రాక్షసత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించింది. కార్తీక్ ను బెదిరించింది. ఇప్పుడు నన్ను చంపేయాలన్నంత కోపం నీకు ఉందని నాకు తెలుసు కార్తీక్. కానీ, నేను నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను. నీ పిచ్చితోనే ఇలా చేస్తున్నాను. పదహారేళ్ళుగా నిన్ను ప్రేమించి.. నువ్వు దీపను పెళ్ళిచేసుకుంటే నేను పరాయిదానిలా మిగిలిపోవాలా? నాది నిజమైన ప్రేమ కార్తీక్. అందుకే, నేను నిన్ను ఎలాగైనా స్వంతం చేసుకుంటాను. అంటూ చెప్పుకొస్తుంది. అంతేకాకుండా.. తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. తనను పెళ్లి చేసుకుంటే..పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళతాననీ..కార్తీక్ బయటకు వచ్చే మార్గం చూపిస్తాననీ చెబుతుంది. తానూ కార్తీక్ ను ఎంతగా ప్రేమించిందో చెబుతూనే.. కార్తీక్ ఒకవేళ తాను బ్రతికి ఉన్న విషయం పోలీసులకు చెబితే.. దీప తో సహా అతని కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తుంది. ఒక్కరోజు గడువు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన తరువాత కార్తీక్ ను చూడటానికి దీప వస్తుంది. దీపను చూసిన కార్తీక్ చాలా బేలగా మారిపోతాడు. మోనిత వచ్చిన విషయం చెబుదామని అనుకుని.. అందర్నీ చంపేస్తాను అని మోనిత చెప్పిన మాటలు గుర్తువచ్చి చెప్పాడు. తనలో తానే మధన పడుతుంటాడు. దీప కార్తీక్ మానసికంగా బాధపడుతున్నాడని గుర్తించి బాధపడుతుంది. ఇదీ నిన్నటి (1132) ఎపిసోడ్ లో జరిగింది. మరి ఈరోజు ఎపిసోడ్ (1133)లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఆసుపత్రిలో దీపను చూసి కార్తీక్ నువ్వు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకున్నావ్? అని అడుగుతాడు. తనతో మోనిత దీపను.. ఇంట్లో వాళ్ళను చంపేస్తాను అని చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి టెన్షన్ పడతాడు. దీప కార్తీక్ పరిస్థితి చూసి కంగారు పడుతుంటుంది. కార్తీక్ నువ్వు ఇక్కడే పడుకో.. రాత్రికి ఇక్కడే ఉండు అని దీపకు చెబుతాడు. సరే అంటుంది దీప మళ్ళీ అంతలోనే వద్దు.. సౌర్యకు ఒంట్లో బాగాలేదు కదా.. నువ్వు ఆదిత్యకు ఫోన్ చేసి కారు తెప్పించుకుని ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇలా పొంతన లేకుండా మాట్లాడుతున్న కార్తీక్ ను చూసి దీపకు అనుమానం వస్తుంది. ఈయన ఎప్పుడూ ఇలా ఉండడు. ఏమి జరిగి ఉంటుంది అని ఆలోచిస్తుంటుంది.

అక్కడ ఇంటి దగ్గర సౌర్య, హిమ దగ్గర సౌందర్య ఉంటుంది. సౌర్య అమ్మ రాత్రంతా రాలేదు కదూ.. డాడీ దగ్గరే ఉంది కదూ.. అంటే డాడీకి ఏదైనా జ్వరం వచ్చిందా? అని ప్రశ్నిస్తుంది. దానికి సౌందర్య అటువంటిది ఏమీ లేదు అని చెబుతుంది. అమ్మ వచ్చేస్తుంది అంటుంది. ”నా బెంగ అమ్మ గురించి కాదు. డాడీ గురించే. డాడీ గురించి ఆలోచించే వారు ఎవ్వరూ లేరు. అమ్మ వలెనే ఇదంతా జరిగింది.” అంటూ తల్లి మీద ద్వేషాన్ని వెళ్లగక్కుతుంది. దానికి సౌందర్య.. మీ అమ్మ ఎప్పుడూ కష్టాల్లోనే బ్రతికింది దాని గురించి ఆలోచించండి అని అంటుంది. అయితే, పిల్లలు ఇద్దరూ దీపను పూర్తిగా తప్పుగా మాట్లాడతారు. పైగా.. సౌందర్యకు కూడా కార్తీక్ అంటే ఇష్టం లేదనీ.. అసలు ఎవరికీ కార్తీక్ అంటే ఇష్టం లేదనీ అందరూ తమ తల్లినే సపోర్ట్ చేస్తారనీ అంటూ పెద్ద మాటలు మాట్లాడతారు. దీంతో సౌందర్య పిల్లలను వారిస్తుంది. మీరు పెద్ద మాటలు మాట్లాడకండి. అని చెబుతుంది. నాలుగు రోజుల్లో మీ డాడీ వచ్చేస్తాడు. అంతవరకూ ప్రశాంతంగా ఉండండి. పిల్లలు పిల్లల్లా ఉండండి అని చెబుతూనే.. దీప గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదని గట్టిగ హెచ్చరిస్తుంది.

ఇక రాక్షసి మోనిత చీర సింగారించుకుని.. మందులు వేసుకోబోతూ.. తన కడుపులోని బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది. మీ నాన్నను చూసావుగా.. ఎలా ఉన్నాడు? అందగాడు కదూ. అందమే కాదు మంచివాడు కూడా. అందుకే మీ నాన్నగా చేశాను. కానీ, ఆ దీప మనల్ని డిస్టర్బ్ చేస్తోంది. దాని సంగతి తెల్చేస్తాను. నువ్వు బయటకు వచ్చేలోపు మీ నాన్నను బయటకు తీసుకువచ్చేస్తాను. అప్పటివరకూ నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పుకుంటుంది. టానిక్ తాగుతూ ఇది తాగితే చక్కగా నిద్ర వస్తుంది. ఏమీ ఆలోచించకుండా పడుకో.. నేను అన్ని విషయాలు చూసుకుంటాను అని మాట్లాడుకుంటుంది.

దీప బయట నుంచి కార్తీక్ గదిలోకి వస్తుంది. అక్కడ కార్తీక్ కనిపించడు. దీంతో కంగారు పడుతుంది. బయటకు వచ్చి అక్కడ ఉన్న ఎస్ఐ ని అడుగుతుంది. ఆటను అదుగో అక్కడ కూచున్నారు అని చెబుతాడు. ఆయన దేనికో భయపడుతున్నారు. కంగారుగా ఉన్నారు అందుకే ఆయన్ని కాసేపు బయట కూచోమని ఇక్కడి నుంచే మేము వాచ్ చేస్తున్నాం అని ఎస్ఐ చెబుతాడు. అక్కడ నేలమీద కూచుని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. దీప అతని దగ్గరకు వెళుతుంది. ఏమిటండీ అలా ఉన్నారు అని అడుగుతుంది. మీరు మీలా లేరు. ఏమి జరిగింది అని అడుగుతుంది. ఏమీలేదు దీప మీ గురించే ఆలోచిస్తున్నాను. నేను చేసిన తప్పుకు అందరూ బాధపడుతున్నారు అంటూ బాధపడతాడు. దానికి దీప కాదు.. మీరు ఏ తప్పూ చేయలేదు అని చెబుతుంది. ఇన్నాళ్ళూ మా అందరి కోసం మీరొక్కరే ఉన్నారు. కానీ, ఈరోజు మీ ఒక్కరికోసం మేమంతా ఉన్నాం. అనవసరంగా ఆందోళన పడకండి అని చెబుతుంది. కార్తీక్ ను అనునయిస్తుంది.

మరోవైపు రాక్షసి మోనిత తాళి బొట్టు తీసి రేపు నాకూ కార్తీక్ కూ పెళ్లి అని కానిస్టేబుల్ రామసీతకు చెబుతుంది. దీంతో ఆమె అవాక్కవుతుంది. ఇదీ ఈరోజు ఎపిసోడ్ కథనం. మరి మోనిత అన్నంత పనీ చేసిందా? దీప కార్తీక్ ను రక్షించిండా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ (1134) వరకూ ఆగాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే