Hyderabad Rains: భారీగా చేరుతున్న వరదనీరు.. హిమాయత్ సాగర్ రిజ్వాయర్ గేట్లు ఎత్తివేత

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసి నదిలోకి విడుదల చేశారు.

Hyderabad Rains: భారీగా చేరుతున్న వరదనీరు.. హిమాయత్ సాగర్ రిజ్వాయర్ గేట్లు ఎత్తివేత
Hyderabad Himayat Sagar
Follow us

|

Updated on: Aug 31, 2021 | 6:19 PM

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని హిమాయత్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసి నదిలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. జలమండలి అధికారులు మంగళవారం ఉదయం 11.30 గంటలకు రెండు రిజర్వాయర్ల గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి వదులుతున్నారు. అలాగే ఈ సాయంత్రం ప్రవాహం మరింత పెరగడంతో సాయంత్రం 5.30 గంటలకు రెండు గేట్లు మరో అడుగు పైకి ఎత్తారు. దీంతో రెండు గేట్లను రెండు అడుగుల వరకు ఎత్తి 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ. దాన కిషోర్ మాట్లాడుతూ… ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందుజాగ్రత్తగా మూసి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. బోర్డు సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో, పరిస్ధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ను, అధికార యంత్రాగాలతో పాటు, జీహెచ్ఎంసీ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు.

హిమాయత్ సాగర్ రిజ్వాయర్ కు మొత్తం 17 గేట్లు ఉన్నాయి. గత జులై 20న జలాశయానికి నీరు పోటెత్తడంతో 3 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసిలోకి వదిలారు.

హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం: 1763.50 అడుగులు ప్ర‌స్తుత నీటి స్థాయి: 1763.20 అడుగులు రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం: 2.968 టీఎంసీలు ప్ర‌స్తుత సామ‌ర్థ్యం: 2.837 టీఎంసీలు ఇన్ ఫ్లో : 1000 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 1400 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేట్లు

Also Read..

మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగితే కష్టాలపాలవుతారు

రజతం గెలిచిన మరియప్పన్ తంగవేలు, హైజంప్‌లో శరద్ కుమార్ ‌కు కాంస్యం..!

Latest Articles