సినీ నిర్మాత బండ్ల గణేష్ తన మొక్కు తీర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపిన అభాండాలు, కుట్రపూరిత కేసులు తొలగిపోతే తిరుమలకు కాలి నడకన వెళ్తానని ఆయన మొక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని జనంపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. అత్యున్నత న్యాయస్థానాలు చంద్రబాబుపై ఉన్న కేసులన్నిటినీ కొట్టివేశాయని ఆయన వెల్లడించారు.