Andhra Pradesh: తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఇప్పటికే ఆందోళనలు ఉదృతం
హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటుకై డిమాండ్ తీవ్రమవుతోంది. అన్ని మౌలిక సదుపాయాలున్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేయలేదని పీవీ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇప్పుడు..మరో కొత్త జిల్లా డిమాండ్ తెర పైకి వచ్చింది. ఇప్పుడు..వివిధ రకాల అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ కేంద్రం గా..పీవీ జిల్లా ను ఏర్పాటు చేయాలనీ రోజు..రోజు కు డిమాండ్ పెరుగుతుంది. ఆ..జిల్లా డిమాండ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం.. హుజురాబాద్ కేంద్రం గా పీవీ జిల్లా ను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ పెరుగుతుంది.ఇప్పటికే జిల్లా ల ఏర్పాటు విషయం లో ప్రభుత్వం లో చర్చ సాగుతుంది..ఈ తరుణం లో. పీవీ జిల్లా ఏర్పాటు కోసం జేఏసీ గా ఏర్పాటు అయ్యారు. దీంతో రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. హుజురాబాద్ ని జిల్లాగా ప్రకటించాలంటూ పీవీ జిల్లా సాధన జేఏసీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ ని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేయలేదని అన్నారు. చిన్న చిన్న ప్రాంతాలను కూడా గతంలో జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పుడు అన్ని వసతులు కలిగిన హుజురాబాద్ ని జిల్లా ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు. 2016 నుంచి హుజురాబాద్ ని పి వి జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఈ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. స్వాతంత్ర అనంతరం హుజరాబాద్ డివిజన్ గా ఉండి హుజురాబాద్ కింద ప్రస్తుత నియోజకవర్గాలు కూడా ఉండేవని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హుజురాబాద్ ని జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే హుజురాబాద్ ని జిల్లాగా ఏర్పాటు చేసి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటు చేసే వరకు ఊరుకునే ప్రసక్తేలేదని మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వివిధ వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తుంది.వెంటనే నిర్ణయం తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీల ధరలు!
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
WhatsApp: యూజర్లకు వాట్సప్ గుడ్‌న్యూస్ గ్రూప్ చాటింగ్ ఫీచర్స్‌లో అప్‌డేట్స్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

