AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే

వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే

G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 20, 2026 | 12:30 PM

Share

పెద్దపల్లి జిల్లాలో జాతీయ పక్షి నెమళ్ళపై వేటగాళ్ల దాడులు తీవ్రమయ్యాయి. ఎలిగేడు మండలం శివపల్లి సమీపంలో ఉచ్చులతో నెమళ్ళను వేటాడుతున్నారు. పచ్చని పొలాల్లో సంచరించే నెమళ్ళు వేటగాళ్ల వలకు చిక్కుకుంటున్నాయి. ఇటీవల ఉచ్చులో పడిన నెమలిని రైతులు రక్షించారు. అటవీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నెమళ్ళను టార్గెట్ చేస్తున్నారు వేటగాళ్లు.. పచ్చని పొలాల్లో సంతోషంగా తిరుగుతున్న..నెమళ్ళు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాయి.చావు బతుకుల మధ్య కొట్టు మిట్టడుతున్న ఓ నెమలిని కాపాడారు రైతులు..ఇటీవల కాలం లో నెమళ్ళను యాదేచ్చగా వేటాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామ సమీపంలోని బోడగుట్ట వద్ద కొంతమంది వేటగాళ్లు జాతీయ పక్షి నెమళ్లకు ఉచ్చులు పెట్టి, వేటాడుతున్నారు. ఈ ప్రాంతం లో ఎక్కువగా నెమళ్ళు సంచరిస్తున్నాయి.. పొలాల మధ్య కూడా తిరుగుతున్నాయి.. ఇది గమనించిన వేటగాళ్లు..ఉచ్చులను ఏర్పాటు చేశారు..ఓ నెమలి ఉచ్చులో పడి..అటు..ఇటు కొట్టుకుంది. దీంతో.. అటుగా వెళ్లిన రైతులకు ఉచ్చులకు మెడకు చుట్టుకుని ఉన్న నెమలిని చూసి వెంటనే గాయపడిన నెమలిని రక్షించారు. తరువాత..అదే ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎలాంటి గాయాలు కాకపోవడం తో..ప్రాణాల తో బయట పడింది. గతంలో కూడా కొంతమంది వేటగాళ్లు నెమళ్ళను వేటాడి చంపిన సంఘటన లు ఉన్నాయి. వేటగాళ్లకు స్థానిక రైతులు వారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మళ్ళీ వేటగాళ్లు నెమళ్లను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నారని, స్థానిక రైతులు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల ను వేటాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!

మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

WhatsApp: యూజర్లకు వాట్సప్ గుడ్‌న్యూస్ గ్రూప్ చాటింగ్ ఫీచర్స్‌‌లో అప్‌డేట్స్

Published on: Jan 20, 2026 12:23 PM