AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు అర్హత సాధించిన మరో 2 జట్లు.. పూర్తి జాబితా ఇదే..

టాస్ గెలిచి మొదట ఆడిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు సాధించింది. ఇందులో వృత్త్యా అరవింద్ 51 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో కుశాల్ మల్లా గరిష్టంగా 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, సందీప్ లమిచానే నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించిన నేపాల్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు అర్హత సాధించిన మరో 2 జట్లు.. పూర్తి జాబితా ఇదే..
T20 World Cup Asia Qualifie
Venkata Chari
|

Updated on: Nov 03, 2023 | 6:47 PM

Share

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్ రీజినల్ ఫైనల్‌లో ఈరోజు రెండు సెమీఫైనల్స్ జరిగాయి. తొలి సెమీఫైనల్‌లో ఒమన్‌ 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్‌పై విజయం సాధించగా, రెండో సెమీఫైనల్‌లో నేపాల్‌ 8 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించడమే కాకుండా తదుపరి వెస్టిండీస్, యూఎస్‌ఏలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, అందులో 18 జట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

మొదటి సెమీ-ఫైనల్‌లో, టాస్ గెలిచి మొదట ఆడిన బహ్రెయిన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు సాధించింది. ఇందులో ఇమ్రాన్ అలీ 30 పరుగులతో అత్యధిక స్కోరు చేయగా, అహ్మర్ బిన్ నిసార్ 26 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లక్ష్యానికి సమాధానంగా, ఒమన్ 14.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇందులో కశ్యప్ ప్రజాపతి (57*), ప్రతీక్ అథవాలే (50*) అర్ధ సెంచరీలు ఆడి అజేయ భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఒమన్ ఆటగాడు ఆకిబ్ ఇలియాస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అతడికి తోడు షకీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

రెండవ సెమీ-ఫైనల్‌లో, టాస్ గెలిచి మొదట ఆడిన యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు సాధించింది. ఇందులో వృత్త్యా అరవింద్ 51 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో కుశాల్ మల్లా గరిష్టంగా 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, సందీప్ లమిచానే నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించిన నేపాల్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 51 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచిన ఆసిఫ్ షేక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అతనితో పాటు కెప్టెన్ రోహిత్ పౌడెల్ 20 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.

జట్లు:

నేపాల్ (ప్లేయింగ్ XI): రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (కీపర్), దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, అబినాష్ బోహారా, బిబేక్ యాదవ్, సందీప్ లామిచానే, కుశాల్ మల్లా.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), ఖలీద్ షా, వృత్య అరవింద్(కీపర్), ఆసిఫ్ ఖాన్, అలీషన్ షరాఫు, బాసిల్ హమీద్, అలీ నసీర్, అయాన్ అఫ్జల్ ఖాన్, నీలాన్ష్ కేస్వానీ, జునైద్ సిద్ధిక్, జహూర్ ఖాన్.

ఇరు జట్లు:

ఒమన్ (ప్లేయింగ్ XI): కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే(కీపర్), అకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), అయాన్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, షకీల్ అహ్మద్, ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్.

బహ్రెయిన్ (ప్లేయింగ్ XI): ఉమర్ టూర్(కెప్టెన్), అబ్దుల్ మజిద్ అబ్బాసీ, ఇమ్రాన్ అలీ బట్(కీపర్), సోహైల్ అహ్మద్, హైదర్ బట్, జునైద్ అజీజ్, రిజ్వాన్ బట్, అలీ దావూద్, అహ్మర్ బిన్ నాసిర్, సర్ఫరాజ్ అలీ, సత్తయ్య వీరపతిరన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..