NED Vs AFG: 179కే కుప్పకూలిన నెదర్లాండ్స్.. పాకిస్తాన్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమైన ఆఫ్ఘాన్..
NED Vs AFG 1st Innings Score: ప్రపంచకప్‌లో భాగంగా 34వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టీం ఆఫ్ఘనిస్థాన్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58 పరుగులతో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
NED Vs AFG 1st Innings Score: ప్రపంచకప్‌లో భాగంగా 34వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టీం ఆఫ్ఘనిస్థాన్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58 పరుగులతో అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోయారు. అఫ్గానిస్థాన్ తరపున మహ్మద్ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభం అంతగా బాగోలేదు. నెదర్లాండ్స్ జట్టు తొలి ఓవర్ ఐదో బంతికే వెస్లీ బరేసి (01) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండో వికెట్‌కు మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకర్‌మాన్ 69 పరుగుల (63 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది జట్టు ఇన్నింగ్స్‌లో అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. ఈ భాగస్వామ్యాన్ని 12వ ఓవర్ మూడో బంతికి విడిపోయింది. 40 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి మాక్స్ ఓడౌడ్ పెవిలియన్ చేరడంతో నెదర్లాండ్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది.
ఆ తర్వాత 19వ ఓవర్‌లో కోలిన్ అకర్‌మన్ 29 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తర్వాతి బంతికే పెవిలియన్ (0)కు చేరాడు. ఓపెనర్, కెప్టెన్ ఎడ్వర్డ్స్ ఇద్దరూ రనౌట్‌ల ద్వారా పెవిలియన్‌కు చేరుకున్నారు. నెదర్లాండ్స్ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్‌లు రనౌట్ ద్వారా వికెట్లు కోల్పోయారు. కెప్టెన్ పెవిలియన్ చేరిన కొద్దిసేపటికే మహ్మద్ నబీ 21వ ఓవర్లో బాస్ డి లీడే (3)గా అవుటయ్యాడు. దీంతో ఆ జట్టు 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
View this post on Instagram
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..