Video: 3 ప్రపంచకప్‌లు.. 14 మ్యాచ్‌లు.. 1 నుంచి 45 వికెట్ల వరకు.. షమీ వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

Mohammed Shami Wickets Video: షమీ తన మూడవ ప్రపంచకప్ ఐదు వికెట్లు సాధించాడు. ODI ప్రపంచకప్‌లలో అత్యధికంగా ఐదు వికెట్లు సాధించిన ఆటగాడిగా షమీ ఇప్పుడు స్టార్క్‌తో సమానంగా నిలిచాడు. ODI ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 జాబితాలో షమీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

Video: 3 ప్రపంచకప్‌లు.. 14 మ్యాచ్‌లు.. 1 నుంచి 45 వికెట్ల వరకు.. షమీ వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Mohammed Shami
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2023 | 4:57 PM

Mohammed Shami: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక 2023 ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై 5 వికెట్లు పడగొట్టిన షమీ.. వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున 45 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్‌లను వెనక్కునెట్టేశాడు. భారత్ తరపున ప్రపంచకప్‌లో జహీర్, శ్రీనాథ్ తలో 44 వికెట్లు తీశారు.

ODI ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 జాబితాలో షమీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెటర్లలో, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్ మాత్రమే వరుసగా 56, 49 వికెట్లతో జాబితాలో షమీ కంటే ముందున్నారు.

షమీ తన మూడవ ప్రపంచకప్ ఐదు వికెట్లు సాధించాడు. ODI ప్రపంచకప్‌లలో అత్యధికంగా ఐదు వికెట్లు సాధించిన ఆటగాడిగా షమీ ఇప్పుడు స్టార్క్‌తో సమానంగా నిలిచాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు..

మహ్మద్ షమీ – 14 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు

జహీర్ ఖాన్ – 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు

జావగల్ శ్రీనాథ్ – 34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు

జస్ప్రీత్ బుమ్రా – 16 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు

అనిల్ కుంబ్లే – 18 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు

వన్డే ప్రపంచకప్‌లో ఆల్ టైమ్ వికెట్లు తీసిన టాప్ 10 ప్లేయర్లు వీరే..

గ్లెన్ మెక్‌గ్రాత్ (AUS) – 39 మ్యాచ్‌లలో 71 వికెట్లు

ముత్తయ్య మురళీధరన్ (SL) – 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు

మిచెల్ స్టార్క్ (AUS) – 24 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు

లసిత్ మలింగ (SL) – 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు

వసీం అక్రమ్ (PAK) – 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు

చమిందా వాస్ (SL) – 31 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు

ట్రెంట్ బౌల్ట్ (NZ) – 26 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు

మహ్మద్ షమీ (IND) – 14 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు

జహీర్ ఖాన్ (IND) – 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు

జవగల్ శ్రీనాథ్ (IND) – 34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..