AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: వన్డే ర్యాంకింగ్‌లో టాప్‌ లేపిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌.. ‘లంకా దహనం’తో అగ్రస్థానం..

Mohammed Siraj: ఆసియాకప్‌నకి ముందు సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలో తనపేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా 8స్థానాలు మెరుగుపరుచుకుని నెంబర్ వన్ ప్లేస్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి, రషీద్ ఖాన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నారు.

ICC Rankings: వన్డే ర్యాంకింగ్‌లో టాప్‌ లేపిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌.. 'లంకా దహనం'తో అగ్రస్థానం..
Mohammed Siraj
Venkata Chari
|

Updated on: Sep 20, 2023 | 4:22 PM

Share

Mohammed Siraj: టీమిండియా పేస‌ర్.. మన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. బౌల‌ర్ల జాబితాలో 694 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసియాకప్‌ ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. శ్రీలంకను చావుదెబ్బతీసి.. ఆసియా కప్‌ టీమిండియా సొంతం చేసుకోవడంలో కీ రోల్ పోషించాడు.

ఆసియాకప్‌నకి ముందు సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలో తనపేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా 8స్థానాలు మెరుగుపరుచుకుని నెంబర్ వన్ ప్లేస్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి, రషీద్ ఖాన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నారు. టాప్ 10లో భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ 10 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్ (11వ స్థానం), దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎన్‌గిడి (21వ స్థానం) కూడా లాభపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇక బ్యాటర్ల జాబితాలో వన్డే ర్యాంకింగ్‌లో శుభ్‌మన్ గిల్ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానంలో, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 20 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.

ICC ఇటీవలి ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. గత వారం, ఆసియా కప్‌లో చివరి మ్యాచ్‌లతో పాటు, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా జరిగింది. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై ఓటమి కారణంగా భారత జట్టు అగ్రస్థానానికి చేరుకోలేకపోయింది. అయితే దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు పరాజయాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు మూడవ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ సూపర్ 4లో పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ, పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

టాప్ 10కి వెలుపల ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ కెరీర్‌లో అత్యుత్తమ 13వ స్థానంలో ఉండగా, వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన బెన్ స్టోక్స్ 13 స్థానాలు ఎగబాకి 36వ స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ నాలుగు స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో, శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక రెండు స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ ఐదు స్థానాల లాభంతో 29వ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ కారీ కూడా మూడు స్థానాలు ఎగబాకి 29వ స్థానంలో ఉన్నాడు.

వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, భారత్ నుంచి హార్దిక్ పాండ్యా టాప్ 10లో ఆరో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..