21 నిమిషాల బ్యాటింగ్.. 18 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. సీన్ కట్ చేస్తే!

దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలజడి సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో..

21 నిమిషాల బ్యాటింగ్.. 18 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. సీన్ కట్ చేస్తే!
Wade
Follow us

|

Updated on: Feb 08, 2023 | 8:41 AM

దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలజడి సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన వేడ్ 18 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఫలితంగా ఆ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

సోమవారం ముంబై ఇండియన్స్ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో వేడ్ 222 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగుల వవరద పారించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వేడ్.. అప్పటిదాకా ఉన్న స్లో-రేట్‌ను ఒక్కసారిగా పరుగులు పెట్టించాడు. ఫలితంగా జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది. అటు ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని చేధించడంలో చతికిలబడి 76 పరుగుల దూరంతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్‌ఫార్మ్ ఓపెనర్లిద్దరూ కూడా తమ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అలాంటి పరిస్థితుల్లో డుప్లాయ్(81), మాథ్యూ వేడ్(40) కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. 28 ఏళ్ల డుప్లాయ్ 168 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 48 బంతుల్లో అజేయంగా 81 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

ఇక మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చీరాగానే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్న 21 నిమిషాలు విధ్వంసం సృష్టించాడు. మొత్తానికి 18 బంతులు ఎదుర్కున్న వేడ్ 222 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో 40 పరుగులు చేశాడు. ఇందులో అతడు 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌లకు జోబర్గ్ కింగ్స్ 189 పరుగుల భారీ స్కోర్ చేయగిలిగింది.

అయితే ఈ లక్ష్యాన్ని చేధించడంలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ చతికిలబడింది. కొత్జీ(3/27), సిమ్మండ్స్(3/23), తీక్షణా(2/16) ధాటికి నిర్ణీత ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రేవిస్(27) ఒక్కడే జట్టులో టాప్ స్కోరర్. కాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం.. టీ20 కెప్టెన్సీ రేసులో మ్యాథ్యూ వేడ్, ఆస్టన్ టర్నర్, హెజిల్‌వుడ్ ఉన్నారు. వీరిలో ముందు వరుసలో వేడ్ ఉన్న విషయం తెలిసిందే.