AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 మంది బౌలర్ల ఊచకోత.. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 653 పరుగులు..

ఏ జట్టుకైనా టాప్ ఆర్డర్ కీలకం. మొదటి మూడు స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్లు రాణిస్తే.. మ్యాచ్ గెలిచినట్లే.. లేదంటే ఓడిపోయినట్లే..

8 మంది బౌలర్ల ఊచకోత.. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 653 పరుగులు..
Royal London Cup
Ravi Kiran
|

Updated on: Aug 11, 2021 | 2:06 PM

Share

ఏ జట్టుకైనా టాప్ ఆర్డర్ కీలకం. మొదటి మూడు స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్లు రాణిస్తే.. మ్యాచ్ గెలిచినట్లే.. లేదంటే ఓడిపోయినట్లే.. అయితే ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల గురించి చెప్పబోతున్నాం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల విజయావకాశాలను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు శాసించారు. హైవోల్టేజ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో సుమారు 8 మంది బౌలర్లను ఊచకోత కోశారు. బ్యాట్స్‌మెన్ల దెబ్బకు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ రాయల్ లండన్ వన్డే కప్ టోర్నమెంట్‌లో జరిగింది.

మంగళవారం టాంటన్‌ వేదికగా లీసెస్టర్‌షైర్, సోమర్‌సెట్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సోమర్‌సెట్‌ ఓపెనర్ స్టీవ్ డావీస్(61) అర్ధ సెంచరీతో అదరగొట్టినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. అయితే ఆరు, ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్లు బార్ట్‌లెట్‌(108: 4 ఫోర్లు, 8 సిక్సర్లు), థామస్(75) చెలరేగిపోయారు. దీనితో జట్టు నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది.

కెప్టెన్ అద్భుత సెంచరీ.. జట్టు అద్భుత విజయం..

లీసెస్టర్‌షైర్ జట్టు 327 పరుగుల భారీ లక్ష్యాన్ని 32 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కెప్టెన్ లూయిస్ హిల్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా.. మరో వైపు నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించాడు. 106 బంతుల్లో 107 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్ లూయిస్ కింబర్ 57 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగుల చేయడంతో భారీ లక్ష్యాన్ని చేధించడం మరింత సులభతరమైంది.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

8 పరుగులకే నాలుగు వికెట్లు.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు ఖాతానే తెరవలేదు.. టీమిండియా వరస్ట్ రికార్డు