25 నిమిషాల్లో మ్యాచ్ ఫలితం మార్చిన భారత ఉమెన్ ప్లేయర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం
తన ఆల్ రౌండ్ గేమ్‌తో ప్రత్యర్థి జట్టు స్థితిని చెల్లాచెదురు చేసేసింది. మొదట బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు ఇబ్బంది పెట్టి, ఆపై తన బ్యాట్‌తో జట్టుకు విజయాన్ని అందించింది.
ఇంగ్లీష్ లీగ్‌లో ఓ టీమిండియా మహిళా క్రికెటర్ సత్తా చాటింది. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టును ఓడిచింది. మొదట బాల్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను గడగడలాండించింది. అనంతరం బ్యాట్‌తో లక్ష్యాన్ని సాధించి తనదైన ముద్ర వేసింది. బ్యాట్‌తో కేవలం 25 నిమిషాల్లో టార్గెట్‌ను పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్‌లో భారత ఉమెన్స్ క్రికెటర్లు భాగమైన సంగతి తెలిసిందే. 100-బాల్ టోర్నమెంట్‌లో భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ బలమైన మద్ర వేసింది. లండన్ స్పిరిట్ తరపున ఆడుతున్న దీప్తి శర్మ మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచులో అద్భుత ప్రతిభ చూపింది. బంతి, బ్యాట్ రెండింటితో సత్తా చాటి జట్టు విజయానికి తోడుగా నిలిచింది.
మొదటి మ్యాచ్‌లో, మాంచెస్టర్ ఒరిజినల్స్ బ్యాటింగ్ చేసి 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుపడింది. 20 బంతులు సంధించిన దీప్తి శర్మ.. 10 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ మొదట ఓపెనర్ లిచెల్ లీని ఔట్ చేసింది. ఆ తర్వాత మొదటి డౌన్ బ్యాట్స్‌మన్ ప్రీజ్‌ను కూడా పెవిలియన్ చేర్చింది.
25 నిమిషాల్లో జట్టుకు విజయం.. లండన్ స్పిరిట్ గెలిచేందుకు నిర్ణీత ఓవర్లలో 128 పరుగులు సాధించాలి. ఈ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి లండన్ స్పిరిట్ సాధించింది. దీప్తి శర్మ అత్యుత్తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ దీప్తి 25 నిమిషాల పాటు క్రీజులో ఉండి, 20 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీప్తి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు ఉన్నాయి. వికెట్ల మధ్య పరుగెత్తుతూ ఎక్కువ పరుగులు సాధించింది. దీప్తి ప్రదర్శన కారణంగా, లండన్ స్పిరిట్ కేవలం 98 బంతుల్లో 131 పరుగులు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
Also Read: డొమెస్టిక్ క్రికెట్‌లో బౌలర్ల ఊచకోత.. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 653 పరుగులు