IND vs ENG: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్విన్‌కు ఛాన్స్.. సిరాజ్, ఇషాంత్‌ల మధ్య పోటీ?

India vs England 2nd Test: ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ప్రారంభించే గొప్ప అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. నాటింగ్‌హామ్‌లో ఆ అదృష్టం భారత్‌‌కు దక్కలేదు. మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది.

IND vs ENG: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్విన్‌కు ఛాన్స్.. సిరాజ్, ఇషాంత్‌ల మధ్య పోటీ?
Ind Vs Eng Lords Test Playing XI
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2021 | 1:38 PM

India vs England 2nd Test: ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ప్రారంభించే గొప్ప అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. నాటింగ్‌హామ్‌లో ఆ అదృష్టం భారత్‌‌కు దక్కలేదు. మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలిటెస్టు డ్రాగా ముగిసింది. అయితే రెండవ టెస్టు రేపటి నుంచి (గురువారం) లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. రెండవ టెస్టులో విజయం సాధించేందుకు ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తాయని తెలిసిందే. లార్డ్స్ వేదిక టీమిండియాకు అంతగా కలిసిరావడం లేదు. అయితే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌ని ఓడించి ఏడేళ్లయింది. 2018 లో విరాట్ కోహ్లీ సేన సాధించలేకపోయింది. కానీ, ఈసారి జట్టు మరింత సమతూకంగా, దృఢంగా కనిపిస్తుండడంతో ఎలాగైనా లార్డ్స్‌లో విజయం సాధించాలని కోరుకుంటోంది.

లార్డ్స్ టెస్ట్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ అంచనా : 1 కేఎల్ రాహుల్: రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వకపోతే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. తొలి టెస్టు జరిగిన నాటింగ్‌హామ్‌లో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు సాధించాడు. అలాగే రెండవ ఇన్నింగ్స్‌లో 26 పరుగులు సాధించాడు. మంచి ఫాంలో ఉన్నాడు. రెండవ టెస్టులోనూ కచ్చితంగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

2 రోహిత్ శర్మ: ఇంగ్లీష్ గడ్డపై రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మొదటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు సాధించాడు. రెండవ టెస్టులో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో తొలిసారి బరిలోకి దిగనున్నాడు. ఈమేరకు తన మ్యాచ్‌ను అద్భుతంగా ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

3 ఛతేశ్వర్ పుజారా: పుజారాకు మళ్లీ కష్టకాలం వచ్చింది. తొలి టెస్టులో మంచి ఇన్నింగ్స నిర్మించలేదు. దీంతో అతని స్థానికి ఎసరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, మరోసారి అతని చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తనదైన రోజున మ్యాచును ఒంటిచేత్తో మార్చగలిగే అద్భుత బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు.

4 విరాట్ కోహ్లీ (కెప్టెన్): భారత కెప్టెన్ లార్డ్స్‌లో ఆతిథ్య జట్టుపై అధిపత్యం చూపాలని కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు గొప్ప ఇన్నింగ్స్ నిర్మించలేదు. అలాగే భారీగా పరుగులు సాధించలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. లార్డ్స్ టెస్టులో ఆలోటును భర్తీ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే తొలి టెస్టులో జేమ్స్ ఆండర్సన్‌ బౌలింగ్‌లో తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

5 అజింక్య రహానే: రహానే తొలి టెస్టులో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే కోహ్లీ మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

6 రిషబ్ పంత్ (వికెట్ కీపర్): పంత్ లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఆడేందుకు బరిలోకి దిగనున్నాడు. దీంతో తొలిసారి లార్డ్స్‌లో బరిలోకి దిగి, తనదైన ముద్ర వేసేందుకు ఆశపడుతున్నాడు.

7 రవీంద్ర జడేజా: జడేజా బౌలింగ్ మెరుగ్గానే ఉంది. తొలి టెస్టులో అర్ధ సెంచరీతో లోయర్ ఆర్డర్‌ బలాన్ని పెంచాడు. ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేందుకు 2 వ టెస్టులో ఇలాంటి ప్లేయర్ అవసరం చాలా ఉంటుంది.

8 ఆర్ అశ్విన్: తొలి టెస్టులో నిరాశ పరిచిన శార్దుల్ ప్లేస్‌లో అశ్విన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

9 మొహమ్మద్ షమీ: తొలి టెస్టులో తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న షమీ.. రెండవ టెస్టులోనూ అదే జోరును కొనసాగించాలని మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోంది.

10 మహ్మద్ సిరాజ్/ఇషాంత్ శర్మ: నాటింగ్‌హామ్‌లో సిరాజ్ బంతితో, బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇంకా రాకపోవడతో.. ఈ ఇద్దరి పేసర్ల మధ్య ఎవరుంటారోనని కొద్దిగా సందేహం ఉంది.

11 జస్ప్రీత్ బుమ్రా: భారత పేస్ అటాక్ నాయకుడిగా బుమ్రా ప్రస్తుతం ఈ సిరీస్‌లో వికెట్లు తీసే జాబితాలో ముందున్నాడు. అతను నాటింగ్‌హామ్‌లో 9 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

భారతదేశం ప్లేయింగ్ ఎలెవన్ అంచనా: రోహిత్ శర్మ,  రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్/ ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

Also Read: 25 నిమిషాల్లో మ్యాచ్ ఫలితం మార్చిన భారత ఉమెన్ ప్లేయర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం

England vs India 2nd Test : రెండో టెస్ట్‌కి ఆ ఇద్దరు పేసర్లు అనుమానమే..! ఎవరో తెలుసా..?