AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England vs India 2nd Test : రెండో టెస్ట్‌కి ఆ ఇద్దరు పేసర్లు అనుమానమే..! ఎవరో తెలుసా..?

England vs India 2nd Test : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగే రెండో టెస్ట్‌లో ఇరు జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌ రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌, ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ గాయాలతో

England vs India 2nd Test  : రెండో టెస్ట్‌కి ఆ ఇద్దరు పేసర్లు అనుమానమే..! ఎవరో తెలుసా..?
England Vs India 2nd Test
uppula Raju
|

Updated on: Aug 11, 2021 | 1:29 PM

Share

England vs India 2nd Test : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగే రెండో టెస్ట్‌లో ఇరు జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆల్‌ రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌, ఇంగ్లాండ్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్బంగా బ్రాడ్ గాయపడగా శార్దుల్‌ కండరాల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఇద్దరు రెండో టెస్ట్ ఆడుతారో లేదో అని డౌట్‌గా ఉంది. అయితే శార్దుల్‌ స్ఠానంలో రవిచంద్రన్‌ అశ్విన్ ని ఎంపిక చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పిచ్ స్పిన్‌కి అనుకూలంగా ఉంటుందని సమాచారం.

మరోవైపు టీమిండియా అదనపు బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే ఆలోచన కూడా ఉంది. మయాంక్ లేదా హనుమ విహారీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మయాంక్‌కు అవకాశం లభిస్తే కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడవచ్చు. హనుమ విహారి జట్టులోకి వస్తే కేఎల్ రాహుల్ రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే ఇండియాకి అనుభవజ్ఞుడైన భారత పేసర్ లేకపోవడంతో ఇశాంత్ శర్మని కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉమేశ్ యాదవ్ పేరుకూడా వినిపిస్తుంది. కోహ్లీ ఎవరి వైపునకు మొగ్గు చూపుతారో తెలియడం లేదు. మరోవైపు లార్డ్స్‌లో 150వ టెస్ట్ ఆడాల్సి ఉన్న బ్రాడ్‌.. జట్టుకు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా ఇంగ్లండ్‌ జట్టుపై కూడా ప్రభావం చూపనుంది. సిరీస్‌ కీలక దశలో సీనియ‌ర్ బౌల‌ర్ సేవ‌లు కోల్పోవడం ఇంగ్లీష్‌ జట్టుకు మింగుడు ప‌డ‌ని విషయమే. ఇప్పటికే ఆ జట్టు జోఫ్రా ఆర్చర్‌, క్రిస్ వోక్స్‌ లాంటి బౌల‌ర్ల సేవ‌లు కోల్పోయింది. తొలి టెస్ట్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే.

Donkey Milk : వామ్మో గాడిద పాలు లీటరుకి పదివేలంట..! ఎందుకో ఇంత ఖరీదు..?

శత్రు దేశల్లో భారత్ సింహగర్జన..డ్రాగన్ కు, దాయదికి..ఒకేసారి చెక్..!మోదీ సూపర్ ప్లాన్..!:PM Modi Master Plan Live Video.

Allu Arjun: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఐకాన్’ మూవీ.. అల్లు అర్జున్‌‌‌కు జోడీగా మరోసారి ఆ భామ..