టీ20 ప్రపంచకప్ టీంను ప్రకటించిన కివీస్… టీ20లో 3 సెంచరీలు చేసిన ఆటగాడికి చోటు మిస్.. రిటైర్మెంట్ ఇచ్చేశారా అంటూ ఆవేదన
రెండు నెలల తరువాత జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. ఇందులో కొంతమంది సీనియర్లకు చోటు లభించకపోవడంతో వివాదాలు చెలరేగుతున్నాయి.
Colin Munro: టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటించారు. యూఏఈ, ఒమన్‌లో జరిగే టోర్నమెంట్ కోసం జట్టును రెండు నెలల ముందే ప్రకటించారు. కానీ, విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్‌మన్‌కు అందులో చోటు దక్కలేదు. ఆ ఆటగాడు దీని గురించి చాలా విచారంగా ఉన్నాడు. దీంతో పదవీ విరమణ సంకేతాలను బోర్డుకు అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈయనే కోలిన్ మున్రో. టీ20 వరల్డ్ కప్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్ పర్యటనలకు ఆయనకు జట్టులో చోటు దక్కలేదు. దీనిపై కొలిన్ మన్రో స్పందిస్తూ, తాను టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని పేర్కొనడం విశేషం.
జట్టులో ఎంపిక కాకపోవడం గురించి కోలిన్ మున్రో ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆవేదనను రాసుకొచ్చాడు. ‘జట్టులో చోటు లభించకపోవడం చాలా నిరాశ కలిగించింది. టీ20 ప్రపంచ కప్ జట్టులో ఆడాలన్నది నా లక్ష్యం. ఎంపిక కాకపోవడంతో ఇప్పటికే న్యూజిలాండ్ కోసం నా చివరి మ్యాచ్ ఆడినట్లుగా అనిపిస్తోంది. కోలిన్ మన్రో చివరిసారిగా ఫిబ్రవరి 2020లో న్యూజిలాండ్ తరపున ఆడాడు. దీని తరువాత అతను మరోసారి ఆడలేదు. అతను అంతర్జాతీయ టీ20లో 31.34 సగటు, 156.44 స్ట్రైక్ రేట్‌తో 1724 పరుగులు సాధించాడు. అతడి పేరు మీద మూడు అంతర్జాతీయ టీ 20 సెంచరీలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ వంటి ప్రపంచవ్యాప్త టీ20 లీగ్‌లలో కూడా ఆడాడు. ఇటీవలి కాలంలో, అతను టీ20 క్రికెట్‌లో 140.21 స్ట్రైక్ రేట్, 37.94 సగటుతో పరుగులు సాధించాడు.
మన్రోని తీసుకోకపోవడంపై కోచ్ ఏమన్నాడంటే.. మరోవైపు, న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ, మున్రో టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడు. కానీ, అంతకు ముందు జరిగే సిరీస్‌లకు విశ్రాంతి కల్పించాం. కొలిన్ మున్రోకు ప్రపంచకప్ అవకాశాలు తగ్గలేదు. ఇంకా ఛాన్స్ ఉంది. మున్రో ఎలాంటి ఆటగాడో టీంకు తెలుసు. గత ఆరు నెలలుగా ప్రస్తుత టీ20 జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఎంపికచేయకపోవడంపై గల కారణాలను ఇప్పిటకే మున్రోకు వివరించాము’ అని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ టీం: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్, మిచెల్ సాట్నర్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఐష్ సోధి, టిమ్ సౌథీ, అడమ్ మిల్నే
Also Read: IND vs ENG: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్విన్‌కు ఛాన్స్.. సిరాజ్, ఇషాంత్‌ల మధ్య పోటీ?
25 నిమిషాల్లో మ్యాచ్ ఫలితం మార్చిన భారత ఉమెన్ ప్లేయర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం