MS Dhoni: క్షమాపణ చెప్పిన జెమీమా రోడ్రిగ్స్.. అయినా శాంతించని ధోని అభిమానులు
భారత మహిళల క్రికెట్ జట్టులోని సీనియర్ ప్లేయర్లు ప్రస్తుతం ఇంగ్లండ్ లీగ్‌లలో ఆడుతున్నారు. వీరిలో స్మృతి మంధన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మతోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టులోని సీనియర్ ప్లేయర్లు ప్రస్తుతం ఇంగ్లండ్ లీగ్‌లలో ఆడుతున్నారు. వీరిలో స్మృతి మంధన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మతోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. వారందరూ ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో తమ సత్తా చూపిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లందరూ తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు. జెమీమా రోడ్రిగ్స్ ఇందులో ముందు వరుసలో ఉంది. హండ్రెడ్ మహిళల విభాగంలో పరుగులు సాధించడానికి ఆమె ముందంజలో ఉంది. నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ టీమ్ తరపున ఆడుతూ సంచలనాలు నెలకొల్పుతోంది. కానీ, ఆగస్టు 10 న మ్యాచ్‌లో మాత్రం ఆడలేదు. దీంతో టోర్నమెంట్ సమయంలో స్కై స్పోర్ట్స్ కోసం వ్యాఖ్యానం చేసేందుకు సిద్ధమైంది. కామెంట్రీ ఇస్తున్న సమయంలో జెమిమా రోడ్రిగ్స్ చేసిన ఒక ప్రకటన చాలా సంచలనంగా మారింది. ఈ ప్రకటన భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించినది కావడంతో సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.
జెమిమాను తన అభిమాన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఎవరు అని అడిగారు. దీనికి బదులిస్తూ ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరును వెల్లడించింది. వెంటనే నోటకరచుకుని మరుసటి క్షణంలో జెమీమా తన అభిమాన కీపర్ కం బ్యాట్స్‌మన్‌గా ఎంఎస్ ధోనీ అని చెప్పింది. ‘నేను ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనుకుంటున్నాను … ఓహ్, నన్ను క్షమించండి ఎంఎస్ ధోనీ కూడా. లేదంటే భారత ప్రజలు నన్ను చంపేస్తారు’ అని సమాధానమిచ్చింది. అయితే దీనిని చాలా మంది సరదాగా తీసుకున్నారు. కొంతమంది మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తీవ్ర చర్చగా మార్చారు. అందులో ఎక్కువ మంది ధోనీ అభిమానులే ఉన్నారు. జెమిమా వ్యాఖ్యలపై ధోని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ది హండ్రెడ్‌లో జెమిమా సందడి.. ప్రముఖ క్రికెటర్లు ఇంగ్లండ్‌లో వ్యాఖ్యానం కూడా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతోనే జెమిమాను కూడా పిలిచారు. హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లలో 60.25 సగటు, 154.48 స్ట్రైక్ రేట్‌తో 241 పరుగులు సాధించింది. ఈ టోర్నీలో 92 నాటౌట్ ఆమె అత్యధిక స్కోరు. ఈ టోర్నమెంట్‌లో ఆమె ఇప్పటివరకు మూడు అర్ధ సెంచరీలు సాధించింది. కనీసం 100 పరుగులు చేసిన ఆటగాళ్లలో, జెమిమాకు సమానమైన సగటు, స్ట్రైక్ రేట్ ఎవరికీ లేకపోవడం విశేషం. జెమిమా అద్భుతమైన ఆటతో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ జట్టు ప్రస్తుతం రెండవ స్థానంలో నిలిచింది. ఈ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌లు గెలిచింది. వీటిలో రెండింటిలోనూ జెమిమా అద్భుతంగా ఆడింది.
Also Read: IND vs ENG: టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్విన్‌కు ఛాన్స్.. సిరాజ్, ఇషాంత్‌ల మధ్య పోటీ?
25 నిమిషాల్లో మ్యాచ్ ఫలితం మార్చిన భారత ఉమెన్ ప్లేయర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం