Former Cricket Star: వెంటిలేటర్‌పై స్టార్ క్రికెటర్.. చిన్న తప్పుతో జీవితం కోల్పోయి.. బస్సు క్లినర్‌గా మారిన వైనం
Former Cricket Star: క్రికెట్ లో ఆల్ రౌండర్ ఎన్నో రివార్డులు అవార్డులు.. మరింత మంది అభిమానులు.. అయితే ఒక్కసారిగా మ్యాచ్ ఫిక్సింగ్ తో కెరీర్ మలుపు తీసుకుంది. జీవితం గాడి తప్పింది.. పూలు అమ్మిన చోటే.. కట్టెలు అమ్ముకునే..
Former Cricket Star: క్రికెట్ లో ఆల్ రౌండర్ ఎన్నో రివార్డులు అవార్డులు.. మరింత మంది అభిమానులు.. అయితే ఒక్కసారిగా మ్యాచ్ ఫిక్సింగ్ తో కెరీర్ మలుపు తీసుకుంది. జీవితం గాడి తప్పింది.. పూలు అమ్మిన చోటే.. కట్టెలు అమ్ముకునే స్టేజ్ కు చేరుకున్నాడు.. కాలక్రమంలో అనారోగ్యం పాలయ్యాడు.. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. అతను ఎవరో కాదు ప్రఖ్యాత న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్..
క్రిస్ కెయిన్స్ గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం క్రిస్ కెయిన్స్ చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్ ఫిక్సింగ్ తో కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు. స్కై స్పోర్ట్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహించాడు.
క్రిస్ కెయిన్స్ గుండె లోపల నీరు చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసినా .. సరిగ్గా స్పందించడం లేదు. దాంతో కెయిన్స్‌కు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఓ వైపు బ్యాటింగ్ తో పరుగుల వరదను సృష్టించేవాడు.. మరోవైపు బౌలింగ్ తో వికెట్లను తీసేవాడు. కెరీర్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సిన సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోణలతో కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.. ఐపీఎల్లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అప్పటి ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపించారు. దీంతో క్రెయిన్స్ పేరు ఐపీఎల్ నుంచి తొలగించారు.
ఇక స్కై స్పోర్ట్స్ కోసం క్రిస్ కెయిన్స్ వ్యాఖ్యానం చేశాడు. క్రికెటర్ గా కెరీర్ మూసిన తర్వాత అనేక కష్టాలు పడ్డాడు. 2017లో బస్టాండుల్లో బస్సులను కడుగుతూ జీవనం సాగించాడు. ట్రక్కులు నడుపుతూ.. బస్ షెల్టర్లను క్లీన్ చేశాడు. ప్రతిరోజు కష్టపడేవాడు. అలా బస్టాండుల్లో గంటకు 17 డాలర్లు సంపాదించేవాడు. కూడు.. గూడుకు పోను మిగిలినవి మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో న్యాయ ఖర్చుల కోసం వినియోగించాడు. 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ ఇప్పడు అనారోగ్య సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా క్రిస్ కెయిన్స్ సోదరుడు క్రిస్ హారిస్ కూడా కివీస్ తరపున మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Also Read: Veg Momos Recipe: చైనీస్ వంటకం వెజ్‌మోమోస్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారీ చేసుకోవడం ఎలా అంటే