Veg Momos Recipe: చైనీస్ వంటకం వెజ్‌మోమోస్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారీ చేసుకోవడం ఎలా అంటే

Veg Momos Recipe: ఇప్పుడు ఎక్కువగా  హోటల్స్‌లో కనిపిస్తున్న వెరైటీ వంటకం మోమోస్. ఇది టిబెటన్ ఆథంటిక్ వంటకం. నేపాల్ తో పాటు మన దేశంలోని లడక్, సిక్కిం ప్రాంతంలోనూ మోమోస్ కనిపిస్తుంటాయి. ఇక ఈ మోమోస్..

Veg Momos Recipe: చైనీస్ వంటకం వెజ్‌మోమోస్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారీ చేసుకోవడం ఎలా అంటే
Veg Momos Recipe
Follow us
Surya Kala

|

Updated on: Aug 11, 2021 | 12:41 PM

Veg Momos Recipe: ఇప్పుడు ఎక్కువగా  హోటల్స్‌లో కనిపిస్తున్న వెరైటీ వంటకం మోమోస్. ఇది టిబెటన్ ఆథంటిక్ వంటకం. నేపాల్ తో పాటు మన దేశంలోని లడక్, సిక్కిం ప్రాంతంలోనూ మోమోస్ కనిపిస్తుంటాయి. ఇక ఈ మోమోస్ వెజ్ మోమోస్, పనీర్ మోమోస్, మష్రూమ్ మోమోస్, చికెన్ మోమోస్ ఇలా చాలా వెరైటీలే ఉన్నాయి. ఈరోజు వెజ్ మోమోస్ తయారీ గురించి తేలుకుందాం.. మోమోస్ ను మూడు స్టెప్స్ ల్లో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మోమోస్ తయారీని మూడు భాగాలుగా విడదీసుకుందాం:

ముందుగా మోమోస్ ఫిల్లింగ్ :

ఈ ఇన్సైడ్ ఫిల్లింగ్ కోసం ఓ పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, ఓ పెద్ద ఉల్లిపాయ, ఓ చిన్న కాబేజీ, రెండుమూడు కారెట్లు, పచ్చి బఠాణి, తీసుకోవాలి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఓ పెద్ద చెంచాడు మిరియాలపొడి కూడా తీసుకోవాలి.(ఇష్టమైనవారు బీన్స్ వంటి కూరగాయలను కూడా వేసుకోవచ్చు). తర్వాత స్టౌ పై బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడా నూనెవేసి .. సన్నగా తరుక్కున్న పచ్చి బఠానీ , బీన్స్ లను వేసుకుని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత వరసగా అల్లం, వెల్లుల్లి ముక్కలూ, ఉల్లి ముక్కలూ, కారెట్, కాబేజీ తరగూ వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు పొయ్యమీద మగ్గనివ్వాలి. తర్వాత ఈ కూరగాయల మిశ్రమంలో తగినంత ఉప్పూ, కొద్దిగా సోయాసాస్, పెద్ద చెంచాడు, మిరియాల పొడీ వేసి ఓసారి కలియబెట్టి అప్పుడు స్టౌ మీద నుంచి దింపెయ్యాలి.ఈ మిశ్రమం కనీసం 20 నిమిషాల పాటు చల్లారాలి.

ఔట్ సైడ్ లేయర్ ప్రిపరేషన్:

ఒక కప్పు మైదా తీసుకుని కొంచెం వేడి నూనె వేసుకుని.. పూరి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని పూరీలకు చేసే ముద్దలా సంగం సైజు ఉండలుగా చేసుకుని కొద్దిగా పొడి పిండి జల్లి పూరీలను బల్లమీద వీలున్నంత పలచగా ఒత్తుకోవాలి.

ఫైనల్ గా మోమో తయారీ :

ఒక్కో పూరీ ఉండనూ పలుచగా ఒత్తుకున్నాక మధ్య భాగంలో ఫిల్లింగ్ ను సుమారు ఒక చెంచాడు పెట్టి, పూరి అంచులకు కొద్దిగా తడి రాసి అంచులను ఫిల్లింగ్ బయటకు రాకుండా మనకు షేప్స్ లో దగ్గరగా చేర్చుకుని ఒత్తుకోవాలి. తర్వాత వాటిని ఇప్పుడు వీటిని మోమో స్టాండ్ లో కానీ పెట్టుకోవాలి.. ఒకవేళ మోమోస్ స్టాండ్ లేనివారు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అచ్ఛం ఇడ్లీలు ఉడికించుకున్నట్లు ఉడికించుకోవాలి. అయితే ఇడ్లీ పాత్రలో రేకులకు మోమోలు అతుక్కోకుండా కొంచెం నూనె రాసుకోవాలి.. తర్వాత మోమోస్ లు రేకుల్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. అంతే వేడివేడి వెజ్ మోమోలు రెడీ. వీటిని వేడిగా ఉండగానే హాట్ హాట్ షేజువాన్ చెట్నీ తో తింటేనే బావుంటాయి.

Also Read: Blood Cholesterol: నరాల వాపులు, నొప్పి, బలహీనత, రక్తం గడ్డకట్టడం వీటన్నిటికీ ఈ ఆయుర్వేద చిట్కాతో చెక్