ఎక్కడైనా ఎర్ర బెండకాయలు చూసారా..? ఎర్ర బెండకాయల కర్రీ తిన్నారా..? ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..

ఈ బెండకాయలు మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి.. ఎర్రగా నిగనిగలాడుతూ మందంగా కనిపించే ఈ బెండకు ప్రస్తుతం మార్కెట్‌‌లో మంచి గిరాకీ పలుకుతోంది.

ఎక్కడైనా ఎర్ర బెండకాయలు చూసారా..? ఎర్ర బెండకాయల కర్రీ తిన్నారా..? ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..
Red Lady Finger Farming In Warangal
Follow us

|

Updated on: Aug 11, 2021 | 12:50 PM

సాధారణంగా బెండకాయలు ఆకుపచ్చని రంగులో ఉంటాయి.. ఈ బెండకాయలు మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి.. ఎర్రగా నిగనిగలాడుతూ మందంగా కనిపించే ఈ బెండకు ప్రస్తుతం మార్కెట్‌‌లో మంచి గిరాకీ పలుకుతోంది. ఆ గిరాకీనే అందిపుచ్చుకున్నారు.. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలానికి చెందిన రైతు.

పెంబర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి.. తోటి రైతులకు భిన్నంగా ఆలోచించాడు. తక్కువ సాగుతో ఎక్కువ దిగుబడి పొందాలనుకున్నాుడు. ప్రజలకు మేలైన జాతీ కూరగాయలను అందించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎరుపు రంగులో ఉండే బెండను పండిస్తున్నారు. అది కూడా పూర్తి సేంద్రియ పద్దతిలోనే పంటను సాగు చేస్తున్నారు. ఈ అరుదైన రకమైన బెండను సాగు చేస్తూ.. అందరినీ ఆకట్టుకున్నాడు. గత 10 ఏళ్లుగా కూరగాయాలు సాగు చేస్తున్నా ప్రభాకర్ రెడ్డి.. ఎర్ర బెండు విత్తనాలను బెంగళూర్‌ నుండి సేకరించాడు. తన 4 గుంటల భూమిలో సాగు చేసాడు. అనుకున్నట్లుగానే పంట బాగా పండింది. అధిక లాభాలు రావడంతో.. ఆదర్శరైతుగా మారిపోయాడు.

పెంబర్తిలో పండిస్తున్న ఎర్రగా నిగనిగలాడుతూ మందంగా కనిపించే ఈ బెండ కాయలు.. పంటకాలం ఐదు నెలలు.. ఈ మొక్కలు 8 అడుగుల వరకు ఎత్తు పెరుగుతున్నాయి. బెండకాయలు సైజ్ 8 ఇంచుల వరకు ఉంటోంది. దీంతో ప్రభాకర్ రెడ్డి పొలం వద్దకే వచ్చి ఎర్ర బెండను కొనుక్కు వెళుతున్నారు స్థానికులు. బెండకాయ అంటేనే పోషకాల గని అని దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు నిపుణులు. ఫైబర్‌ పుష్కలం. మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలూ అనేకం. కొలెస్ట్రాల్‌కూడా నియంత్రణలో ఉంటుంది. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందంటున్నారు. అందుకే, ‘బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటున్నారు నిపుణులు. ‘పచ్చబెండకు చిట్టి తమ్ముడు అయిన ఎర్రబెండ ఆరోగ్యానికి మరింత మంచిదనీ’ అంటున్నారు. రైతుల్లో అవగాహన లేకపోవడంతో పెద్దగా పండించడం లేదు. దీంతో, ధర కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితేనేం, పోషక విలువలు మాత్రం అనేకం. కొసమెరుపు ఏమిటంటే, ఎర్ర బెండకాయ వండిన తర్వాత మాత్రం ఎర్రగా ఉండదు!

ఎర్ర బెండకాయలో పోషకాలు ఎక్కువే…

❁ విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మొదలైన పోషకాలు పుష్కలం. ❁ కంటిచూపును మెరుగుపరుస్తాయి. ❁ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ❁ ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. ❁ రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ❁ బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్య తీరుతుంది. ❁ డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

— పెద్దీష్, టీవీ 9 ప్రతినిధి, వరంగల్ 

Read Also… Venkaiah Naidu: సభ పవిత్రతను నీరుగార్చారు.. రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు