AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RCB, IPL 2024: ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ జట్టు కోల్ కతా చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట కోల్ కతా బ్యాటింగ్ చేసింది.

KKR vs RCB, IPL 2024: ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు
Royal Challengers Bengaluru
Basha Shek
|

Updated on: Apr 21, 2024 | 8:05 PM

Share

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru: ఆర్సీబీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ జట్టు కోల్ కతా చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట కోల్ కతా బ్యాటింగ్ చేసింది. శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ, ఫిలిఫ్ సాల్ట్, రస్సెల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. విల్ జాక్స్‌ ( 32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్‌ ( 23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించినా ప్రమోజనం లేకపోయింది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) , ప్రభుదేశాయ్‌ (24), గ్రీన్‌ (6) మహిపాల్‌ (4) తీవ్రంగా నిరాశ పర్చారు. ఆఖరులో దినేశ్‌ కార్తీక్‌ (24), శర్మ(20) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడినా భారీ లక్ష్యం కావడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, సునీల్‌ నరైన్‌ చెరో 2, వరుణ్‌ చక్రవర్తి, స్టార్క్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు.

కాగా ఈ ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. అదృష్టం తోడైతే తప్ప ఆ జట్టు నాకౌట్ చేరుకునే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్, రజత్ పటీదార్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్ కుమార్ వైశాఖ్, స్వప్నిల్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి