PBKS vs GT, IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన గుజరాత్.. టీమ్‌లోకి అఫ్గాన్ సంచలనం
Punjab Kings vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 37వ మ్యాచ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Punjab Kings vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 37వ మ్యాచ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 4 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ టోర్నీలో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి. ఏప్రిల్ 4న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి విజయానికి 200 పరుగుల టార్గెట్ ను విధించింది. పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయం సాధించింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు మెరుపు ఇన్నింగ్స్ ను ఆడి పంజాబ్ ను గెలిపించారు.
బ్యాటింగ్ చేయనున్న పంజాబ్..
Match 3️⃣7️⃣ from Mullanpur 🤩
Sam Curran wins the toss and Punjab Kings will bat first 🪙#PBKSvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3KmmhyfRrA
— JioCinema (@JioCinema) April 21, 2024
రెండు జట్ల XI ప్లేయింగ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
సామ్ కుర్రాన్ (కెప్టెన్), ప్రభాసిమ్రాన్ సింగ్, రిలే రోసో, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
Match 37. Punjab Kings XI: R. Rossouw, P. Singh, S. Curran (c), J. Sharma (wk), L. Livingstone, S. Singh, A. Sharma, H. Brar, H. Patel, K. Rabada, A. Singh https://t.co/avVO2pBYUg #TATAIPL #IPL2024 #PBKSvGT
— IndianPremierLeague (@IPL) April 21, 2024
ఇంపాక్ట్ ప్లేయర్లు:
రాహుల్ చాహర్, విధ్వత్ కావరప్ప, అథర్వ తైడే, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, శివమ్ సింగ్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
సాయి సుదర్శన్, శరత్ BR, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








