AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా… చిన్న స్వామిలో రాహుల్ సెలబ్రేషన్స్.. వైరల్‌ అవుతున్న వీడియో!

గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళారుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ గెలుపులో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ ముగిశాక చిన్న స్వామి స్టేడియం నా అడ్డా అన్నట్టు రాహుల్ చేసిన సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి.

KL Rahul: ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా... చిన్న స్వామిలో రాహుల్ సెలబ్రేషన్స్.. వైరల్‌ అవుతున్న వీడియో!
Kl Rahul
Anand T
|

Updated on: Apr 11, 2025 | 10:02 AM

Share

IPL 2025: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా గురువారం చిన్న స్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్ వన్‌ మ్యాన్‌షో చేశాడు. ఆర్సీబీ బౌలర్స్‌కు చుక్కలు చూపించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లుతో 93 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్స్‌పై విరుచుకుపడ్డాడు. రాహుల్ దూకుడుతో 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇక మ్యాచ్‌ గెలుపు తర్వాత చిన్న స్వామి స్టేడియం నా అడ్డా అన్నట్టు కేఎల్ రాహుల్ చేసిన సెలబ్రేషన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కర్ణాటకకు చెందిన కేఎల్‌ రాహుల్‌కు ఈ చిన్న స్వామి స్టేడియం బాగా అచ్చొచ్చిన పిచ్‌. పిచ్‌ ఎలా ఉంటుందో రాహుల్‌కు బాగా తెలుసు కాబట్టి రాహుల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. సరైన టైమ్‌లో టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. తన అద్భుత ఇన్నింగ్‌తో జట్టుకు సూపర్‌ విక్టరీ అందించాడు. ఇక కేఎల్‌ రాహుల్‌ కూడా ఆ రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో స్టేడియంలో అటు బెంగళూరు ఫ్యాన్స్‌ కూడా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, “పిచ్ కొంచెం ట్రికీగా ఉందని… కానీ తాను వికెట్ కీపింగ్ చేస్తూ పిచ్‌ను బాగా గమనించానని చెప్పుకొచ్చాడు. పిచ్‌ ట్రికీగా ఉన్నప్పటికీ బాల్‌ స్థిరంగా పడుతుందని.. దాన్ని బట్టే తాను ఆడానని తెలిపాడు. ఏ టైంలో షాట్స్‌ ఆడాలో తనకు తెలుసని..మొదట్లో దూకుడుగా ఆడి, తర్వాత పరిస్థితిని అంచనా వేశానని చెప్పాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..