Video: అందరు చూస్తుండగానే సెహ్వాగ్ కాలర్ పట్టుకుని కొట్టిన దిగ్గజ ప్లేయర్.. గంగూలీ ఎంట్రీతో.. అసలేమైందంటే?
John Wright vs Virender Sehwag: భారత మాజీ కోచ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో కొట్టాడని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. 2004లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తర్వాత ఈ సంఘటన జరిగింది. సెహ్వాగ్ ఆటతీరుపై అసంతృప్తితో రైట్ ఈ చర్యకు పాల్పడ్డాడు. సెహ్వాగ్ తన ఆటశైలిని మెరుగుపరచుకోవడానికి రైట్ ప్రయత్నించాడని, అతని ఉద్దేశం మంచిదేనని సెహ్వాగ్ తర్వాత తెలిపాడు. ఈ ఘటన డ్రెస్సింగ్ రూమ్ వివాదాలపై చర్చకు దారితీసింది.

John Wright Punched Virender Sehwag: డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ వాదనల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి వార్తలను ఎవరు లీక్ చేస్తున్నారనే అన్వేషణ కూడా బీసీసీఐ మొదలుపెట్టింది. ఈ వార్తలను వైరల్ చేసే ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంతకుముందు చాలా వివాదాలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో అవి తెరపైకి రాలేదు. ఆటగాళ్లు రిటైరైన తర్వాత ఈ ఘటనలను సదరు ఆటగాళ్లు ప్రస్తావించేవారు. వీరేంద్ర సెహ్వాగ్‌తో ఇలాంటి సంఘటనే జరిగింది. దానిని సౌరవ్ గంగూలీ వివరించాడు. భారత మాజీ కోచ్ జాన్ రైట్ ఒకసారి సెహ్వాగ్ కాలర్ పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్‌లో కొట్టాడంట. ఈ విషయాన్ని గంగూలీ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇది 2004లో చోటు చేసుకుంది. వీరూ తన దూకుడు శైలికి ప్రసిద్ది చెందిన సంగతి తెలిసిందే. ఎక్కువ షాట్లు ఆడినందుకు కోచ్ రైట్ చేత ఓ దెబ్బ తినాల్సి వచ్చింది. సెహ్వాగ్ తక్కువ పరుగులు చేస్తున్నాడు, రైట్ సలహాను వినకుండా మళ్లీ అదే తప్పు చేశాడు. ఓవల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహేల జయవర్ధనే 62 పరుగుల బలంతో శ్రీలంక 202 పరుగులు చేసింది. ఆ సమయంలో కెప్టెన్లుగా ఉన్న సెహ్వాగ్, సౌరవ్ గంగూలీలు భారత్‌కు బ్యాటింగ్‌కు తెరతీశారు. సెహ్వాగ్ ఇన్నింగ్స్ ఆద్యంతం తన దూకుడు విధానాన్ని కొనసాగించలేకపోయాడు.
గంగూలీ ప్రకారం, సెహ్వాగ్ దూకుడుగా ఆడాడు. కానీ, త్వరగా అవుట్ అయ్యాడు. అయితే, సచిన్ టెండూల్కర్ కీలక ఇన్నింగ్స్ తో భారత్ 45వ ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఓ ఈవెంట్‌లో గంగూలీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఈ ఉదంతం చెప్పుకొచ్చాడు. ‘మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్లినప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉంది. అనిల్ కుంబ్లే దగ్గరకు వెళ్లి ‘ఏమైంది?’ అని అడిగాను. అప్పుడు, కుంబ్లే మాట్లాడుతూ, జాన్ రైట్ వీరూని కాలర్ పట్టుకుని, అతన్ని కార్నర్‌కు తీసుకెళ్లి, ‘నువ్వు భారత్‌కు మళ్లీ ఆడలేవు, ఎందుకంటే ఆ షాట్ మనకు మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది’ అని చీవాట్లు పెట్టాడని తెలిపాడు.
View this post on Instagram
గంగూలీ మాట్లాడుతూ, ‘నేను జాన్ వద్దకు వెళ్లి, ‘వీరేంద్ర సెహ్వాగ్‌ను కొట్టావా? అని అడిగాను, అందుకు అవును, నేను కొట్టాను’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నేను, ‘అతను నిన్ను తిరిగి కొట్టాడా?’ అని అడిగే, దానికి జాన్, ‘లేదు’ అంటూ జవాబిచ్చాడు’ అని తెలిపాడు.
వీరూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అది శ్రీలంకతో మ్యాచ్. మేం గెలవడానికి 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. అంతకుముందు 2-3 మ్యాచ్‌ల్లో భారీ షాట్లు కొట్టి తొందరగానే ఔట్ అయ్యాను. జాన్ రైట్ వచ్చి పిచ్‌పై నిలబడి అర్ధ సెంచరీ పూర్తి చేయమని చెప్పాడు. I don’t want to loose u.. నాకు దీని వెనుక ఉన్న పరమార్థం అర్థం కాలేదు. మైదానంలోకి దిగి సాధారణ శైలిలో ఆడాను. 20-30 పరుగుల తర్వాత నేను ఔట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళ్లాను. జాన్ రైట్ నా కాలర్ పట్టుకుని కొట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అప్పుడు వీరూ చాలా కోపంగా వెళ్లి రాజీవ్ శుక్లాతో విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత, జాన్ రైట్ నా గదికి వచ్చి క్షమాపణలు చెప్పాడు. కానీ, వారి ఉద్దేశం మంచిదే. నా ఆటను మెరుగుపరుచుకోవాలని వారు కోరుకున్నారు అంటూ వీరూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








