AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మాజీ SRH ప్లేయర్ బీభత్సం.. కన్నేసిన 5 ఫ్రాంచైజీలు

సెంచూరియన్‌లో మూడవ టీ20లో, భారత జట్టు సౌతాఫ్రికాపై విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. సౌతాఫ్రికా ఓటమి అంచున ఉన్న సమయంలో మార్కో జాన్సెన్ 54 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో వారిని గెలిపించేంత పని చేశాడు. జాన్సెన్‌ ప్రదర్శనతో ఐపీఎల్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి.

IPL 2025: ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మాజీ  SRH ప్లేయర్ బీభత్సం.. కన్నేసిన 5 ఫ్రాంచైజీలు
Marco Jansen
Narsimha
|

Updated on: Nov 15, 2024 | 11:14 AM

Share

సెంచూరియన్ లో జరిగిన మూడవ టీ20లో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాపై విజయం సాధించిన టీమిండియా సిరీస్ లో 2-1 తో లీడ్ లోకి వచ్చింది. అయితే 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సాఫారీలు ఒకానొక దశలో 140 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచునకు నిలిచింది. అయితే మార్కో జాన్సెన్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సౌతాఫ్రికాను గెలిపించినంత పని చేశాడు.

ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో జాన్సెన్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి బౌలింగ్‌లో అదరగొట్టాడు. ఆ తర్వాత 17 బంతుల్లో 54 పరుగులు సాధించి, దాదాపు దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు తీసుకువెళ్లాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న జాన్సెన్‌ను, రాబోయే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు విడుదల చేశారు. ఇప్పుడు జాన్సెన్ ను దక్కిచుకోవడం కోసం అనేక ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అటు బ్యాట్ తో ఇటు బంతితో రాణించే జాన్సెన్ ని తమ జట్టులో వేలంలో దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఐపీఎల్ 2025 వేలంలో మార్కో జాన్సెన్‌ కోసం పోటీ పడే ఐదు జట్లు: ముంబై ఇండియన్స్ (MI):

మార్కో జాన్సెన్ 2021లో ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్నాడు. ఇప్పుడు ముంబై అతన్ని తమ జట్టులో తిరిగి చేర్చుకోవచ్చని అంచనా. జస్ప్రీత్ బుమ్రా వంటి బలమైన పేసర్లతో కలిసి జాన్సెన్ బౌలింగ్ దళానికి బలం తీసుకురాగలడు. బౌలింగ్ తో పాటు, జాన్సెన్‌ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది, ఇటీవల సీజన్లలో ముంబై ఇండియన్స్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జాన్సెన్ ఆ లోటు తీర్చే అవకాశముంది.

రాజస్థాన్ రాయల్స్ (RR)

రాజస్థాన్ రాయల్స్ 2025 సీజన్‌కు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వీరిలో ఒకే ఒక బౌలర్ మాత్రమే ఉన్నారు. రాయల్స్ జట్టు తమ బౌలింగ్ దళాన్ని బలోపేతం చేయడం కోసం మార్కో జాన్సెన్‌ను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఎడమ చేతి పేసర్ జాన్సెన్‌ను చేర్చడం ద్వారా టీమ్ బౌలింగ్ లో వైవిద్యంగా మారుతుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 కోసం అయిదుగు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. మార్కో జాన్సెన్ వంటి ఆల్‌రౌండర్‌ వారి బౌలింగ్, బ్యాటింగ్ లో డెప్త్ తీసుకువస్తాడు. న్యూ బాల్‌తో మొహ్సిన్ ఖాన్‌కు తోడుగా జాన్సెన్ ఉపయోగకరంగా ఉంటాడు. అంతేకాదు చివర్లో బ్యాంటిగ్ చేయగల సత్తా ఉండటంతో లక్నో కూడా జాన్సెన్ కోసం ప్రయత్నించవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

బెంగళూరు టీమ్‌ గత సీజన్ లో బౌలర్లను మార్చింది. జాన్సెన్ బౌలింగ్ లో తొ బ్యాటింగ్ లో కూడా వారికి కలిసివస్తుంది. RCB టీమ్ గతంలో సౌత్ ఆఫ్రికన్ ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. కాబట్టి జాన్సెన్ కోసం ఆర్సీబి తప్పక పోటీ పడటం ఖాయం.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

మిచెల్ స్టార్క్‌ను విడుదల చేసిన తర్వాత, ఎడమ చేతి పేసర్ కోసం చూస్తున్న కేకేఆర్ జాన్సెన్ టార్గెట్ చేసే అవకాశముంది.