IPL 2025: మాకొద్దంటూ ఆర్‌సీబీ గెంటేసింది .. కట్ చేస్తే.. ట్రిపుల్ సెంచరీతో శివ తాండవం చేసిన యంగ్ ఆల్ రౌండర్
ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ వేలానికి ముందే RCB జట్టు నుండి విడుదలైన ఒక యంగ్ ఆల్ రౌండర్ రంజీ ట్రోఫీలో అద్భుత ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ ఫీట్‌తో ఐపీఎల్ వేలంలో అతనికి భారీ డిమాండ్ ఏర్పడుతుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

IPL 2025 వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన యువ ఆల్ రౌండర్ మహిపాల్ లోమ్రోర్ ఇప్పుడు రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో మెరుపు బ్యాటింగ్ ప్రదర్శించాడు. 357 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన లోమ్రోర్ తన ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, 25 ఫోర్లు బాదాడు. ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో, రాజస్థాన్ తరపున ఆడుతున్న మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు, ఇది మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మొదటి ట్రిపుల్ సెంచరీ. వాస్తవానికి పైన పేర్కొన్న విధంగా, RCB జట్టులో నుంచి బయటకు వచ్చిన మహిపాల్ లోమ్రోర్ సరైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా నవంబర్ 24 న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న IPL మెగా వేలంలో అతను భారీ మొత్తాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు, మహిపాల్ లోమ్రోర్ కూడా ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 40 మ్యాచ్‌లు ఆడి 18.17 సగటుతో 527 పరుగులు చేశాడు. ఇందులో అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
గత రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిపాల్ కు పుష్కలంగా అవకాశాలు ఇచ్చింది. కానీ లోమ్రోర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. గత ఐపీఎల్ సీజన్ లో అతనికి ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభించింది. కానీ అతను 15.62 సగటుతో 125 పరుగులు మాత్రమే చేశాడు. అతను ఐపీఎల్ 2023లో 12 మ్యాచ్‌లలో ఒక అర్ధ సెంచరీతో 135 పరుగులు చేశాడు. మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 55 వికెట్లు తీసిన ఆల్ రౌండర్. లిస్ట్ ఏలో 11 వికెట్లు, టీ20లో 9 వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్‌లో అతను ఒక వికెట్ మాత్రమే తీశాడు
రంజీల్లో అదరగొడుతోన్న మహిపాల్..
Mahipal Lomror in last 4 innings in this Ranji Trophy:
– 99(136). – 6(8). – 111(150). – 300*(360).
RCB’S blood dominating at Ranji 🔥 pic.twitter.com/EsZ1qLthRO
— Cricket addicted 🏏🇮🇳 (@VikashJ13660845) November 14, 2024
– He’s Indian Uncapped player. – He can bats anywhere. – He finish the match as well. – He bowl as well. – He is very good fielder as well.
– MAHIPAL LOMROR, A HUGE ASSET FOR ANY TEAM IN THE IPL.🔥 pic.twitter.com/6619cT7zhf
— Tanuj Singh (@ImTanujSingh) November 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








