IPL 2024: ఐపీఎల్ ఢమాల్.. కట్ చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి USA, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ జరగనుంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి USA, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లు కూడా ఇప్పుడు టీ20 ప్రపంచకప్ కోసం కూడా రెడీ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే మొత్తం 20 జట్లను ప్రకటించారు. బీసీసీఐ ఏప్రిల్ 30న టీమ్ ఇండియాను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు అమెరికాలో అడుగుపెట్టనుంది. అయితే ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ జట్టులోని మొత్తం 8 మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో ఆడనున్నారు.
టీమిండియా
టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ పొట్టి ప్రపంచకప్ కోసం ఎంపికయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా
స్విచ్ హిట్ స్పెషలిస్ట్ గ్లెన్ మాక్స్‌వెల్ 15 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కెమెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యాడు
ఇంగ్లండ్
2024 టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టును కూడా ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌లో పేలుడు పేసర్ విల్ జాక్స్, లెఫ్టార్మ్ పేసర్ రీస్ టాప్లీలు చోటు దక్కించుకున్నారు.
న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చోటు దక్కించుకున్నాడు.
వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
Rinku Singh could only find a place in the travelling reserves in India’s ICC Men’s #T20WorldCup 2024 squad 👀
Rohit Sharma and Ajit Agarkar explain that and other selection decisions 👉 https://t.co/6fzxDukKRm pic.twitter.com/TbFN7SJqSP
— T20 World Cup (@T20WorldCup) May 2, 2024
జాతీయ జట్టుకు ఎంపిక చేయని RCB ఆటగాళ్లు:
(భారత్) రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైశాక్, మయాంక్ డాగర్.
ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా),
టామ్ కుర్రాన్ (ఇంగ్లండ్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..