IPL 2024: షాకింగ్.. ఆర్సీబీ కాదు.. లక్నో కాదు.. ముంబైకు పోటీగా ఆ జట్టులోకి చేరనున్న రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముంబయి ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టాడు హిట్ మ్యాన్. అలాంటి సారథిని ముంబై ఫ్రాంచైజీ తప్పించడంతో తీవ్ర దుమారం రేగింది

IPL 2024: షాకింగ్.. ఆర్సీబీ కాదు.. లక్నో కాదు.. ముంబైకు పోటీగా ఆ జట్టులోకి చేరనున్న రోహిత్ శర్మ
Rohit Sharma, Hardik Pandya
Follow us

|

Updated on: Apr 13, 2024 | 7:45 PM

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముంబయి ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టాడు హిట్ మ్యాన్. అలాంటి సారథిని ముంబై ఫ్రాంచైజీ తప్పించడంతో తీవ్ర దుమారం రేగింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీపై, అలాగే కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనికి తోడు రోహిత్ శర్మ ముంబైను వీడతాడంటూ.. ఆ జట్టులో చేరతాడంటూ.. ఈ ఫ్రాంఛైజీలోకి వస్తాడంటూ రోజుకొక రూమర్ పుట్టుకొస్తోంది. కాగా వచ్చే ఎడిషన్ కంటే ముందే రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీని వీడనున్నాడని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. కెప్టెన్సీని తొలగించడంతో పాటు, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య అంతా బాగా లేదని తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా రోహిత్, హార్దిక్ మధ్య సమన్వయం కుదరలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ రోహిత్ శర్మ ముంబై జట్టు నుంచి తప్పుకుంటే.. తర్వాత ఏ జట్టులోకి వస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సంచలన ప్రకటన చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రోహిత్ శర్మ గురించి బీర్‌బిసెప్స్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మొదటగా, రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీని తీసివేయడం తప్పు. మరో 2 సీజన్ల పాటు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండాల్సిందని అన్నాడు. ‘ఫ్రాంచైజీ నుంచి కెప్టెన్సీని తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించడం సరైన నిర్ణయం కాదు. అందుకే మెగా వేలానికి ముందే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యపోనక్లర్లేదు’ అని వాన్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీని విడిచిపెడితే ఏ జట్టుతో వెళ్లవచ్చు అని అడిగినప్పుడు, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో రోహిత్ శర్మ ఆడుతాడని తెలిపాడు. అయితే మైఖేల్ వాన్ చెప్పిన మాటలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ధోనీ తర్వాత సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ జట్టును బాగా ముందుండి నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తోంది. వర్ధమాన నాయకుడి నుంచి నాయకత్వాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ దూరం చేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు