Vaibhav Pandya: హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..

Vaibhav Pandya: హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Apr 13, 2024 | 7:52 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను మోసం చేసిన కేసులో వారి సవతి సోదరుడు వైభవ్‌పాండ్యా ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ముంబైలోని తమ భాగస్వామ్య కంపెనీ నుంచి రూ. 4.3 కోట్లు దారి మళ్లించినట్టు ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వైభవ్, పాండ్యా సోదరులు కలిసి 2021లో ముంబైలో పాలిమర్ వ్యాపారం ప్రారంభించారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను మోసం చేసిన కేసులో వారి సవతి సోదరుడు వైభవ్‌పాండ్యా ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ముంబైలోని తమ భాగస్వామ్య కంపెనీ నుంచి రూ. 4.3 కోట్లు దారి మళ్లించినట్టు ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వైభవ్, పాండ్యా సోదరులు కలిసి 2021లో ముంబైలో పాలిమర్ వ్యాపారం ప్రారంభించారు. హార్దిక్, కృనాల్ ఇద్దరూ చెరో 40 శాతం పెట్టుబడి పెట్టగా, వైభవ్ మాత్రం 20 శాతం పెట్టుబడి పెట్టాడు. రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వైభవ్.. లాభాలను మాత్రం ముగ్గురికీ సమానంగా పంచేవాడు. భాగస్వాములుగా ఉన్న హార్దిక్‌పాండ్యా సోదరులకు తెలియకుండా వైభవ్ అలాంటి కంపెనీనే మరోటి ప్రారంభించాడు. ఈ క్రమంలో తొలి కంపెనీలో లాభాలు గణనీయంగా పడిపోయాయి. దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు, కంపెనీలో తనకున్న 20 శాతం వాటాను రహస్యంగా 33.3 శాతానికి పెంచుకున్నాడు. భాగస్వామ్య కంపెనీ నుంచి చెప్పాపెట్టకుండా లక్షల రూపాయలు దారిమళ్లించడంతోపాటు, కంపెనీ ఖాతా నుంచి కోటి రూపాయలు తన జేబులో వేసుకున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య వాగ్వివాదం జరిగింది. హార్దిక్ సోదరులను తీవ్రంగా హెచ్చరించిన వైభవ్.. వారి ప్రతిష్ఠను మంటగలిపేస్తానని హెచ్చరించాడు. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..