AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ఓటమితో కుంగిపోయిన ఆర్సీబీ ఆటగాళ్లు.. అభిమానులను కంటతడి పెట్టిస్తోన్న డ్రెస్సింగ్ రూమ్ వీడియో

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఛాలెంజ్ ముగిసింది. ఈ లీగ్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. దీంతో ఆ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో కూడా కోహ్లీ టీమ్ కు నిరాశే ఎదురైంది.

IPL 2024: ఓటమితో కుంగిపోయిన ఆర్సీబీ ఆటగాళ్లు.. అభిమానులను కంటతడి పెట్టిస్తోన్న డ్రెస్సింగ్ రూమ్ వీడియో
Royal Challengers Bengaluru
Basha Shek
|

Updated on: May 23, 2024 | 5:03 PM

Share

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఛాలెంజ్ ముగిసింది. ఈ లీగ్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది ఆర్సీబీ. దీంతో ఆ జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో కూడా కోహ్లీ టీమ్ కు నిరాశే ఎదురైంది. ఎలిమినేటర్ రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి అభిమానులతో పాటు ఆటగాళ్లను కూడా బాధించింది. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి RCB అభిమాని కంటతడి పెట్టుకుంటారు. RCB ఫ్రాంచైజీ ఈ వీడియోని X ఖాతాలో షేర్ చేసింది. మ్యాచ్ ఓడిన తర్వాత ఆటగాళ్ల మానసిక స్థితి ఈ వీడియోలో కనిపిస్తోంది. రాజస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత జట్టు మొత్తం నిరుత్సాహంగా మైదానాన్ని వీడింది. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకోగానే వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. మూడున్నర నిమిషాలఈ వీడియోలో అన్నీ రివీల్ అయ్యాయి.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే గట్టిగా డోర్ ను కొట్టేశాడు. ఇక కింగ్ కోహ్లీ నిరాశతో తన మొబైల్ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు. కనీసం తల కూడా పైకి ఎత్తలేకపోయాడు. ఆటగాళ్ళు ఒకరికొకరు దూరంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. మేనేజ్ మెంట్ సిబ్బంది కూడా నిరాశగా కనిపించారు. ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఆవేదనతో జట్టులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తమ జట్టను ప్రోత్సహించిన అభిమానులందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. దినేష్ కార్తీక్ కూడా తన మనసులోని భావాలను బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో…

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన రాజస్థాన్ ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే బెంగళూరు టీమ్ ధాటిగా ఆడలేకపోయింది. కీలక సమయాల్లో ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురవడంతో బౌలర్లు విఫలమయ్యారు. బ్యాడ్ ఫీల్డింగ్ రాజస్థాన్‌పై ఒత్తిడి పెంచలేకపోయింది. అయినా ఆర్సీబీ 19వ ఓవర్ వరకు పోరాడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్