GT vs MI Playing XI, IPL 2024: గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే
Gujarat Titans vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం కొత్త కెప్టెన్లతో ఇరు జట్లు సిద్ధమయ్యాయి. గుజరాత్ నాయకత్వ బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌పై ఉన్నాయి

Gujarat Titans vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం కొత్త కెప్టెన్లతో ఇరు జట్లు సిద్ధమయ్యాయి. గుజరాత్ నాయకత్వ బాధ్యతలు శుభ్‌మన్ గిల్‌పై ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ప్రత్యర్థి జట్లను ఓడించి విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. అలాగే రోహిత్ కూడా కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగనున్నాడు. కాబట్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ అన్ ఫిట్ కావడంతో ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోలేదు. గాయం తర్వాత ఏడాది తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు
ఇద్దరూ కొత్త నాయకులే..
ఐపీఎల్‌లో ఓ వైపు ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, మరోవైపు గుజరాత్ టైటాన్స్‌కు తొలిసారిగా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు కెప్టెన్లు టోర్నీని విజయంతో ప్రారంభించాలని కోరుకుంటారు.
Captains 🤝
Match 5️⃣ underway 🔜
Follow the match ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/h41lQxHYqn
— IndianPremierLeague (@IPL) March 24, 2024
ఇక ఐపీఎల్ చరిత్రలో ముంబై, గుజరాత్ జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. తలో 2 మ్యాచ్‌లు గెలిచాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టు..
శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జోయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, జాన్సన్.
Captain Gill taiyaar che ✅ Team taiyaar che ✅#TitansFAM, are you ready as well?#AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvsMI pic.twitter.com/i5ju3uXzUc
— Gujarat Titans (@gujarat_titans) March 24, 2024
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.
4 debutants among these 11 ⭐⭐ who’ll rep आपली मुंबई against the Titans 🔥#MumbaiMeriJaan #MumbaiIndians #GTvMI | @Dream11 pic.twitter.com/SZ4GSpv7iz
— Mumbai Indians (@mipaltan) March 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




