RR vs LSG, ఐపీఎల్‌ 2024: రాజస్థాన్ vs లక్నో మ్యాచ్‌లో అనూహ్య ఘటన.. క్రికెటర్లకు తప్పిన ప్రమాదం.. వీడియో

సాధారణంగా కొన్నిసార్లు వర్షం కారణంగా, ఇంకొన్ని సార్లు ప్రేక్షకులు మైదానంలోకి ప్రవేశించడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాగే స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కూడా ఆరిపోవడంతో మ్యాచ్‌ను చాలా సేపు నిలిపివేయాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో మ్యాచ్ ఎందుకు ఆగిపోయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

RR vs LSG, ఐపీఎల్‌ 2024: రాజస్థాన్ vs లక్నో మ్యాచ్‌లో అనూహ్య ఘటన.. క్రికెటర్లకు తప్పిన ప్రమాదం.. వీడియో
RR vs LSG IPL Match
Follow us

|

Updated on: Mar 24, 2024 | 6:33 PM

సాధారణంగా కొన్నిసార్లు వర్షం కారణంగా, ఇంకొన్ని సార్లు ప్రేక్షకులు మైదానంలోకి ప్రవేశించడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాగే స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు కూడా ఆరిపోవడంతో మ్యాచ్‌ను చాలా సేపు నిలిపివేయాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఐపీఎల్ 2024 నాలుగో మ్యాచ్‌లో మ్యాచ్ ఎందుకు ఆగిపోయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకు ముందు చాలా అరుదుగా ఇలాంటి కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోయింది, అది కూడా మ్యాచ్ ప్రారంభమైన 2 నిమిషాలకే. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మార్చి 24 ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్, లక్నో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ తరఫున జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించగా, లక్నోలో ఎడమచేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్ బౌలింగ్ ప్రారంభించారు. సరిగ్గా 3.30కి మ్యాచ్ ప్రారంభం కాగా 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ఇలా ఎందుకు జరిగిందంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

మొహ్సిన్ ఖాన్ ఓవర్‌లో 2 బంతులు మాత్రమే వేశాడు. ఆపై గ్రౌండ్ పై నుంచి విజువల్స్ తీసేందుకు అమర్చిన స్పైడర్ క్యామ్ కేబుల్ వైర్ తెగిపోయింది. ఈ వైరు తెగి మైదానంలో పడిపోవడంతో మ్యాచ్‌ను ఆపాల్సి వచ్చింది. అంపైర్లు వెంటనే గ్రౌండ్ స్టాఫ్‌ను పిలిపించారు. వారు లాంగ్ వైర్‌ను సేకరించి ఫీల్డ్ నుండి బయటకు తీసుకెళ్లారు. దీని కారణంగా, ఆట సుమారు 5-6 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇక్కడ వైరు తెగిపోయినా స్పైడర్ కెమెరా ఎఫెక్ట్ కాకుండా యథాతథంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఒకవేళ స్పైడర్ క్యామ్‌ పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఇదొక్కటే కాదు. నాల్గవ ఓవర్‌లో స్టంప్‌ల పైన ఉన్న బెయిల్‌లు దెబ్బతినడంతో మ్యాచ్‌ను మళ్లీ 2-3 నిమిషాలు నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

తెగి పడిన స్పైడర్ కామ్ వైరు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..