Video: గాయంతో దూరమయ్యాడు.. కట్‌చేస్తే.. 129 రోజుల తర్వాత బ్యాట్ పట్టాడు.. మొహాలీలో విధ్వంసానికి సిద్ధం.. ఎవరంటే?
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఇందులో హార్డ్ హిట్టర్ రంగంలోకి దిగనున్నాడు.
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు ఇప్పటికే రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు చివరి ఓవర్, చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతూ.. ప్రేక్షకులకు ఫుల్ జోష్ ఇస్తున్నాయి. అయితే, ఇప్పుడు అభిమానులతోపాటు టీంలకు మరింత జోష్ అందించే వార్తలు వస్తున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లలో ఆడని కొంతమంది ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిలో కొందరు గాయం కారణంగా ఔట్ కాగా.. మరికొందరు అంతర్జాతీయ జాతీయ జట్టు షెడ్యూల్ కారణంగా దూరమయ్యారు. తాజాగా నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టన్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
IPL 2023లో పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ మొహాలీలో జరగనుంది. ఇందులో లియామ్ లివింగ్‌స్టన్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లతో అతను నెట్స్ వద్ద బ్యాట్ ఝుళిపిస్తూ కనిపించాడు.
లివింగ్‌స్టన్ 129 రోజుల తర్వాత బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ లివింగ్‌స్టన్ గుజరాత్ టైటాన్స్‌తో ఆడితే ఐపీఎల్ 2023లో అతనికి అదే తొలి మ్యాచ్ అవుతుంది. దీంతో 129 రోజుల తర్వాత క్రికెట్ మైదానంలో బ్యాట్ పట్టుకుని కనిపించనున్నాడు. లివింగ్‌స్టన్ క్రికెట్‌కు దూరం కావడానికి కారణం అతని గాయం.
View this post on Instagram
గతేడాది డిసెంబర్‌లో పాకిస్థాన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లివింగ్‌స్టన్ మోకాలికి గాయమైంది. ఈ టెస్టు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగింది. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతని IPL జట్టు పంజాబ్ కోసం ప్రదర్శన చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు.
View this post on Instagram
పంజాబ్ కింగ్స్‌లో లియామ్ లివింగ్‌స్టన్‌కు చోటు దక్కుతుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. గత మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయినందున.. నేటి మ్యాచ్‌లో గెలవాలని శిఖర్ ధావన్ టీం కోరుకుంటుంది. ఇందుకోసం హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టోన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..