IPL: 20వ ఓవర్‌లో తోపులు.. ఆ లిస్టులో అగ్రస్థానం మనోడిదే.. టాప్ 5లో ఎవరున్నారంటే?
టీ20 క్రికెట్‌లో బౌండరీల మోత మోగాల్సిందే. ముఖ్యంగా సిక్సర్ల హోరుతో ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంటారు ఆటగాళ్లు. పొట్టి ఫార్మాట్‌గా పేరుగాంచిన టీ20 క్రికెట్‌లో ప్లేయర్స్ నువ్వానేనా అంటూ పోటీ పడుతూ.. భారీ సిక్సర్లు కొడుతుంటారు.
టీ20 క్రికెట్‌లో బౌండరీల మోత మోగాల్సిందే. ముఖ్యంగా సిక్సర్ల హోరుతో ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంటారు ఆటగాళ్లు. పొట్టి ఫార్మాట్‌గా పేరుగాంచిన టీ20 క్రికెట్‌లో ప్లేయర్స్ నువ్వానేనా అంటూ పోటీ పడుతూ.. భారీ సిక్సర్లు కొడుతుంటారు. తుఫాన్ ప్లేయర్లుగా పేరుగాంచిన క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ లాంటి హార్డ్ హిట్టర్ల మోతతో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వీరంతా ఆడింది 200లోపు మ్యాచ్‌లే.. కానీ, సిక్సుల విసయంలో మాత్రం దూసుకపోతున్నారు.
ఈ క్రమంలో చివరి ఓవర్లలో సిక్సులు కొట్టే విషయంలో అగ్రస్థానంలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.. ఐపీఎల్ హిస్టరీలో చివరి ఓవర్లలో ధోని కొట్టిన సిక్సర్ల ధాటికి ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని 20వ ఓవర్లో 53 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. డెత్ ఓవర్లలో ఆడే విషయంలో ఎంఎస్ ధోని నిపుణుడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో 20వ ఓవర్‌లో 50కి పైగా సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్ ధోని నిలిచాడు. శుక్రవారం ధోని జోష్ లిటిల్ బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో సిక్సర్‌గా బాది, ఈ రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో చివరి ఓవర్‌లో ధోనీ ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు.
ఎంఎస్ ధోని తర్వాత పోలార్డ్ 33 సిక్సర్లు, ధోని సహచరుడు రవీంద్ర జడేజా 26, గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా 25, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 23 సిక్సర్లు బాదేశారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్‌లను పరిశీలిస్తే… వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ పేరిట నమోదైంది. గేల్ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాది, అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఏబీ డివిలియర్స్ (251), మూడో స్థానంలో రోహిత్ శర్మ (245), నాలుగో స్థానంలో ధోని (235), ఐదో స్థానంలో విరాట్ కోహ్లి (227) నిలిచారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..