IND vs SA T20 Preview: సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. నేడు సౌతాఫ్రికాతో రెండో టీ20..

మొదటి మ్యాచ్‌లో ఏకపక్ష ఆటతీరుతో సత్తా చాటిన టీమిండియా దృష్టి.. ప్రస్తుతం సిరీస్‌పై పడింది. రెండో మ్యాచ్‌లో గెలవాలని కోరుకుంటుంది.

IND vs SA T20 Preview: సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. నేడు సౌతాఫ్రికాతో రెండో టీ20..
Ind Vs Sa 2nd T20 Preview
Follow us
Venkata Chari

|

Updated on: Oct 02, 2022 | 7:10 AM

తొలి టీ20లో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు అద్భుతంగా ప్రారంభించింది. ఈ తర్వాత రెండు జట్లు నేడు అంటే ఆదివారం గౌహతిలో రెండో టీ20ల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చూపు సిరీస్‌ గెలుపొందేందుకు చూస్తుండగా, దక్షిణాఫ్రికా టీం మాత్రం పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ప్రదర్శన తీరును పరిశీలిస్తే భారత్‌దే పైచేయి కనిపిస్తోంది. బుమ్రా తొలి మ్యాచ్‌లో ఆడలేదు. అతను లేకుండా జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉంది. దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను నాశనం చేశారు.

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా పాత్ర కీలకంగా ఉండేది. అయితే వెన్ను సమస్య కారణంగా పేసర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈవెంట్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రపంచ కప్‌కు ముందు జట్టు సన్నాహాలకు ఖచ్చితమైన రూపాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అయితే బుమ్రా లేకపోవడం ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్‌లను జట్టులోకి తీసుకున్నప్పటికీ వారిద్దరూ ఇంకా ప్రపంచకప్ జట్టులో లేరు. బుమ్రా స్థానంలో వచ్చిన బౌలర్‌ను ప్రయత్నించడానికి టీమ్ మేనేజ్‌మెంట్‌కు తగినంత అవకాశం లభిస్తుందా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉన్న వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం జట్టులో చేర్చలేదు. అక్కడి పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉన్న అతడిని ఆస్ట్రేలియా వెళ్లే జట్టులో చేర్చుకోవచ్చు. అదే జరిగితే, అక్టోబర్ 16న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించదు.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ప్రపంచకప్‌నకు స్టాండ్‌బైగా ఉన్న దీపక్ చాహర్ భారత్‌లో ఉన్నాడు. తిరువనంతపురంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో, చాహర్, యువ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్‌ను షేక్ చేయడంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది. కానీ, ఆస్ట్రేలియాలో బంతి పెద్దగా స్వింగ్ అవ్వదు. చాహర్ కూడా భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్. అర్ష్‌దీప్‌తో పాటు భువనేశ్వర్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. సిరాజ్ విషయానికొస్తే.. గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. భువనేశ్వర్, హర్షల్ పటేల్ గత కొంతకాలంగా చాలా పరుగులు ఇస్తున్నారు. ప్రపంచ కప్‌నకు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

స్పిన్ ప్రభావం చూపేనా..

ప్రస్తుతం స్పిన్‌ విభాగంలో అలాంటి సమస్యేమీ లేకపోవడం భారత జట్టుకు శుభపరిణామం. మోకాలి ఆపరేషన్ చేయించుకున్న రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శన చేశాడు.

సత్తా చాటుతోన్న బ్యాట్స్‌మెన్స్..

బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి సహా భారత టాప్ నలుగురు బ్యాట్స్‌మెన్లు ప్రపంచకప్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నారు. KL రాహుల్ కూడా ఇప్పుడు పరుగులు చేయడం ప్రారంభించాడు మరియు మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచేది. అయితే మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఆసియా కప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పంత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. గత ఏడు మ్యాచ్‌ల్లో కార్తీక్ తొమ్మిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.

సిరీస్ విషయానికొస్తే, దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే తొలి సిరీస్‌ను ఈ పొట్టి ఫార్మాట్‌లో గెలవాలని భారత్ ప్రయత్నిస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ జట్టు చివరిసారిగా 2016లో సెమీ-ఫైనల్‌కు చేరుకోగా, గతేడాది నాకౌట్‌కు కూడా చేరుకోలేకపోయింది.

దక్షిణాఫ్రికా సవాలు..

దక్షిణాఫ్రికాకు కగిసో రబడా, ఎన్రిక్ నోర్కియాలో ఇద్దరు మంచి బౌలర్లు ఉన్నారు. కానీ, మిగిలిన బౌలర్లు సత్తా చాటలేకపోతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ గత మ్యాచ్‌లో రాణించలేకపోయారు.

ఇరు జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, ఎన్రిక్ నోర్కియా, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెహ్లుక్నేవే ప్రిటోరియస్ , కగిసో రబడా, రిలే రోస్సో, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్.