సేమ్‌ డ్రెస్.. ఒకే రకమైన హెయిర్‌ స్టైల్‌తో పోజులిస్తోన్న ఈ చిన్నారులు ఇప్పుడు స్టార్‌ క్రికెటర్లు.. గుర్తుపట్టారా?

ఈ ఫొటోలో ఒకే డ్రెస్ ధరించి పోజులిస్తోన్న ఈ చిన్నారులు ఇప్పుడు స్టార్‌ క్రికెటర్లుగా ఎదిగిపోయారు. ఫార్మాట్ ఏదైనా ఒకరికొకరు పోటీపడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్నారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టేస్తున్నారు.

సేమ్‌ డ్రెస్.. ఒకే రకమైన హెయిర్‌ స్టైల్‌తో పోజులిస్తోన్న ఈ చిన్నారులు ఇప్పుడు స్టార్‌ క్రికెటర్లు.. గుర్తుపట్టారా?
Cricketers
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2022 | 7:12 AM

ఈ ఫొటోలో ఒకే డ్రెస్ ధరించి పోజులిస్తోన్న ఈ చిన్నారులు ఇప్పుడు స్టార్‌ క్రికెటర్లుగా ఎదిగిపోయారు. ఫార్మాట్ ఏదైనా ఒకరికొకరు పోటీపడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్నారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టేస్తున్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో పరుగుల మీద పరుగులు, సెంచరీలు కొట్టేస్తూ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ వీరికి వీరే సాటి. అందుకే సోషల్‌ మీడియాలోనూ వీరికి భారీ ఫాలోయింగ్‌ ఉంది. కేవలం ఆటగాడిగానే కాదు కెప్టెన్లుగానే తమ జట్లకు మరుపురాని విజయాలు అందించిన ఈ స్టార్‌ క్రికెటర్లు ఎవరో గుర్తుపట్టారా మరి.

వారెవరో కాదు టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లీ, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ స్టార్ క్రికెటర్ల ఫొటోలు తరచూ వైరలవుతుంటాయి. అభిమానులు కూడా వీరిని పోల్చుతూ తరచూ నెట్టింట్లో ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. అలా ఒక ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో విశేషమేమిటంటే.. ఈ ఇద్దరు క్రికెటర్లు తమ బాల్యంలో ఒకే తరహా డ్రస్సులు ధరించి ఉండడం. ఈ ఫొటోలో కోహ్లి లేత గోధుమరంగు, బూడిద రంగు కలగలిపిన చొక్కా ధరించి ఉండగా, బాబర్ కూడా దాదాపు అదే కలర్‌ డ్రెస్‌ లో దర్శనమిచ్చాడు. అన్నట్లు వీరి హెయిర్‌ స్టైల్స్‌ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఈ ఫోటోను చూసిన అభిమానులు తమ ప్రేమను ఆపుకోలేకపోతున్నారు. లవ్‌, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తూ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.

Virat Kohli, Babar Azam

Virat Kohli, Babar Azam

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే