IND vs PAK T20 WC Highlights: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం..

|

Updated on: Jun 10, 2024 | 1:28 AM

India vs Pakistan, T20 world Cup 2024 Highlights: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్‌మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

IND vs PAK T20 WC Highlights: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం..
India Vs Pakistan T20 World Cup

India vs Pakistan, T20 world Cup 2024 Highlights: టీ-20 ప్రపంచకప్‌లో 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్థాన్‌ను భారత్ అనుమతించలేదు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ల బౌలింగ్‌తో భారత్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్ డిఫెండ్ చేసిన అతి తక్కువ స్కోరు ఇదే కావడం గమనార్హం. పాక్ జట్టు 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో వచ్చి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్‌మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ -పాకిస్థాన్‌లు ఇప్పటి వరకు 7 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 5 సార్లు విజయం సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Jun 2024 01:15 AM (IST)

    ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం..

    చివరి ఓవర్‌ వరకు సాగిన భారత్, పాక్ పోరులో చివరకు రోహిత్ సేనదే విజయం. దీంతో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 2 గెలిచి టేబుట్ టాపర్‌గా నిలిచింది. మొత్తంగా ఐసీసీ ప్రపంచకప్‌ రికార్డులో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడితే 15 మ్యాచ్‌ల్లో పాక్‌పై విజయా సాధించి, తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.

  • 10 Jun 2024 01:02 AM (IST)

    పాక్ విజయానికి 18 పరుగులు

    పాక్ విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉంది. 19వ ఓవర్ వేసిన బుమ్రా 3 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.

  • 10 Jun 2024 12:46 AM (IST)

    5 వికెట్లు కోల్పోయిన పాక్..

    పాకిస్తాన్ ఛేజింగ్‌లో ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం 16.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. పాక్ విజయానికి మరో 32 పరుగులు కావాల్సి ఉంది.

  • 10 Jun 2024 12:15 AM (IST)

    రెండో వికెట్ డౌన్..

    పాకిస్తాన్ 10.1 ఓవర్లో 2వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

  • 09 Jun 2024 11:55 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే..

    పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ 1 వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. రిజ్వాన్ 17, ఉస్మాన్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Jun 2024 11:47 PM (IST)

    బాబర్ ఔట్.. షాకిచ్చిన బుమ్రా

    బుమ్రా బౌలింగ్‌లో దూకుడు మీదున్న బాబర్ (13)ను పెవిలియన్  చేర్చాడు. దీంతో పాక్ 4.4 ఓవర్లలో 26 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2024 11:13 PM (IST)

    పాక్ టార్గెట్ 120

    టీమిండియా బ్యాటర్లలో పంత్ (42) మినహా ఎవ్వరూ రాణించలేకపోవడంతో.. 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ ముందు 120 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 09 Jun 2024 10:47 PM (IST)

    15 ఓవర్లకు

    15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అమీర్ తన 3వ ఓవర్‌లో రెండు వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు.

  • 09 Jun 2024 10:43 PM (IST)

    పంత్ ఔట్..

    పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయిన భారత్‌కు మరో దెబ్బ తగిలింది. పంత్ (42) పెవిలియన్ చేరాడు.

  • 09 Jun 2024 10:39 PM (IST)

    ధోని శిష్యుడి పేలవ ఫాం..

    పేలవ ఫాంతో దూబే(3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 5వ వికెట్‌గా వెనుదిరిగాడు.

  • 09 Jun 2024 10:30 PM (IST)

    డేంజరస్ సూర్య ఔట్..

    పేలవ ఫాంతో ఇబ్బంది పడుతున్న సూర్య (7) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో భారత్ 89 పరుగుల వద్దు 4 వ వికెట్ కోల్పోయింది.

  • 09 Jun 2024 10:21 PM (IST)

    10 ఓవర్లకు స్కోర్..

    10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 81 పరుగులు చేసింది. పంత్ 34, సూర్య 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 Jun 2024 10:09 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన భారత్..

    టాస్ ఓడిన భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత పంత్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను పునర్మించే క్రమంలో బాగానే ఆడారు. అయితే, 29 పరుగుల భాగస్వామ్యం తర్వాత అక్షర్ పటేల్ (20) బౌల్డ్ అయ్యాడు.

  • 09 Jun 2024 09:55 PM (IST)

    5 ఓవర్లకు భారత్ స్కోర్..

    5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. క్రీజులో పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు.

  • 09 Jun 2024 09:41 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా 2వ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (13) పరుగులు చేసిన తర్వాత షాహీన్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ట్రై చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది.

  • 09 Jun 2024 09:33 PM (IST)

    కోహ్లీ ఔట్..

    వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో కోహ్లీ ఓ బౌండరీ కొట్టి దూకుడు మీదున్నట్లు అనిపించింది. కానీ, ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరాడు.

  • 09 Jun 2024 09:08 PM (IST)

    వర్షంతో ఆగిన మ్యాచ్..

    ఒక్క ఓవర్ ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ మ్యాచ్ ఆగిపోయింది.

  • 09 Jun 2024 08:57 PM (IST)

    షాషీన్ బౌలింగ్‌లో సిక్సర్

    తొలి ఓవర్ వేసిన షాహీన్ షాను రోహిత్ శర్మ చిత్తుగా బాదేశాడు. తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ 8 పరుగులు చేసింది.

  • 09 Jun 2024 08:48 PM (IST)

    మొదలైన మ్యాచ్..

    ఎట్టకేలకు గ్రేట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.

  • 09 Jun 2024 08:35 PM (IST)

    ఒకే ఫ్రేములో ముగ్గురు దిగ్గజాలు..

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాక్‌తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా దిగ్గజాలు సచిన్, యువరాజ్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ద్రవిడ్‌తో సంభాషించారు. టీమిండియా ఆటగాళ్లతోనూ మాట్లాడారు.

  • 09 Jun 2024 08:30 PM (IST)

    బ్యాడ్ వెదర్.. మ్యాచ్ ఆలస్యం..

    టాస్ పడినా.. బ్యాడ్ వెదర్‌తో మ్యాచ్ ఆలస్యం కానుంది. 8.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంపైర్లు ప్రకటించారు.

  • 09 Jun 2024 08:16 PM (IST)

    ఛేజింగ్ జట్టుకే గెలిచే ఛాన్స్..

    టాస్‌కు ముందు న్యూయార్క్‌లో వర్షం కురిసింది. ఈ మైదానంలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరగగా, ఛేజింగ్‌ జట్టు 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది.

  • 09 Jun 2024 08:07 PM (IST)

    ఇరు జట్లు..

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

    పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

  • 09 Jun 2024 08:04 PM (IST)

    IND vs PAK: టాస్ గెలిచిన పాక్..

    పాక్ కెప్టెన్ బాబర్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 09 Jun 2024 07:33 PM (IST)

    న్యూయార్క్‌లో వర్షం.. టాస్ ఆలస్యం..

    కీలక మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో టాస్ ఆలస్యం కానుంది.

  • 09 Jun 2024 07:14 PM (IST)

    పిచ్‌ను కవర్లతో కప్పేసిన సిబ్బంది..

    ప్రస్తుతం పిచ్‌పై కవర్లు వేసి రోలింగ్ చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్ జట్లు నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరుకున్నాయి.

  • 09 Jun 2024 07:10 PM (IST)

    IND vs PAK Weather: మొదలైన చినుకులు..

    టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే న్యూయార్క్‌లోని నాసావులో చినుకులు కురుస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్‌ పేర్కొంది.

  • 09 Jun 2024 07:01 PM (IST)

    IND vs PAK Live: మరికొద్దిసేపట్లో భారత్, పాక్ మ్యాచ్

    మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య రణరంగం ప్రారంభం కానుంది.

Published On - Jun 09,2024 6:55 PM

Follow us
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!